టాలీవుడ్ లో ఒకప్పుడు వరుస సినిమాలతో మంచి పాపులారిటీ తెచ్చుకున్న హీరోయిన్ ‘స్నేహ’. పెళ్లి అయిన తర్వాత దాదాపు సినిమాలకు దూరం అయ్యారు. కొన్నాళ్ల నుంచి ఆమె మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకెళ్తోంది. రామ్ చరణ్ తాజాగా నటించిన సినిమా వినయ విధేయ రామలో కూడా వదిన పాత్రలో ఒదిగిపోయారు. స్నేహ తొలివలపు మూవీతో గోపీచంద్ సరసన నటించారు.
తర్వాత వెంకీ, రాధాగోపాలం, సంక్రాంతి, శ్రీరామదాసు,రాజన్న, ఉలవచారు బిర్యానీ మూవీస్ తో మంచి గుర్తింపు తెచ్చకున్నారు. స్నేహ పుట్టింది ముంబయిలో. స్నేహ అసలు పేరు సుహాసిని రాజారామ్ నాయుడు. ఇంటర్ పూర్తయ్యాక సినీ రంగంపై గల ఆసక్తితో మళయాళ ఇండస్ట్రీ నుంచి ఎంట్రీ ఇచ్చి, అనతికాలంలోనే పలు భాషల్లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణించింది. అయితే ఇటీవల అలీతో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అందులో పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. 2012 మే 11 న తమిళ నటుడు ప్రసన్నతో వివాహం అయినట్లు తెలిపారు. తనది ప్రేమ వివాహం అని చెప్పుకొచ్చింది. మొదట్లో స్నేహపై ప్రసన్నకు కోపం ఉండేదంట.. ఎందుకంటే ఓ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీలో తన పక్కన హీరోయిన్ గా నటించనని చెప్పడంతో తనపై కోపం పెంచుకున్నట్లు తెలిపారు.
వీరి పెళ్లికి మొదట ఇరు కుటుంబపెద్దలు అంగీకరించలేదట. స్నేహ తల్లిదండ్రులు ఒప్పుకున్నా.. ప్రసన్న తల్లిదండ్రులు ఒప్పుకోవడానికి సమయం పట్టిందని చెప్పుకొచ్చారు. గొడవలు కూడా జరిగినట్లు ఆమె చెప్పారు. తర్వాత ఎట్టకేలకు ఒక్కటయినట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ దంపతులకు ఒక పాప, ఒక బాబు కూడా ఉన్నారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…