అన్నతో నిశ్చితార్థం జరిగింది.. అయితే పెళ్లి సమయానికి అన్న రాకపోవడంతో తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేశారు. అయితే తమ్ముడు పెళ్లయితే చేసుకున్నాడు కానీ అన్న ఇష్టపడిన యువతిని తాను పెళ్లి చేసుకోవడంతో ఎంతో కృంగిపోయాడు. ఈ క్రమంలోనే తన భార్యను మానసికంగా వేధించేవాడు. దీంతో పెళ్లి అయిన నెలరోజులు కూడా గడవకముందే నవవధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
పాతబస్తీ వట్టెపల్లికి చెందిన షబ్బీర్ అలీ కుమార్తె షాహిన్‌బేగంకి జల్‌పల్లి న్యూ బాబానగర్‌కు చెందిన మీర్ ఇస్మాయిలుద్దిన్ అనే యువకుడికి గత నెల 12వ తేదీన వివాహం జరిగింది. అయితే మూడు సంవత్సరాల క్రితమే ఇస్మాయిలుద్దిన్ అన్న జలాలుద్దీన్‌తో షాహిన్‌బేగంకి నిశ్చితార్థం అయ్యింది. ఉపాధి కోసం దుబాయ్ వెళ్లారు. అయితే కరోనా కారణం వల్ల జలాలుద్దీన్ ఇంటికి రాలేదు.అలాగే అతడు ఎక్కడున్నాడో కూడా ఆచూకీ తెలియకపోవడంతో ఇరు కుటుంబాల పెద్దలు చర్చించుకొని షాహిన్‌బేగం పెళ్లిని తమ్ముడు ఇస్మాయిలుద్దిన్ కి ఇచ్చి వివాహం చేయాలని భావించారు.
ఈ క్రమంలోనే వీరిరువురు పెళ్లి జరిగినప్పటికీ అన్న కాబోయే భార్యను తన భార్యగా చేసుకున్నందుకు
ఇస్మాయిలుద్దిన్ ఎంతో కృంగిపోయాడు. ఈ క్రమంలోనే ఆమెను ఎంతో మానసికంగా వేధించే వాడని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఎంతో మానసిక వేదనకు గురైన షాహిన్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలోనే తమ కూతురు మరణం పై షాహిన్ బేగం తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…