Tag Archives: tips

మీ ఇంట్లో కరోనా రోగులు ఉన్నారా.. అయితే ఇవి తప్పనిసరి!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న విపత్కర పరిస్థితులలో ప్రతి ఒక్కరు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ నేపథ్యంలోనే మీ కుటుంబంలో ఎవరైనా కరోనా బారిన పడినట్టుయితే వారి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ఇక్కడ తెలుసుకుందాం. కరోనా వ్యాపించడానికి ప్రతి ఒక్కరు ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మన ఇంట్లోనే ప్రత్యేకంగా ఒక గదిలో ఉండటం ద్వారా ఈ వైరస్ నుంచి విముక్తి పొందవచ్చు. అయితే ప్రతి ఒక్కరికి ప్రత్యేక గది సదుపాయం ఉండకపోవచ్చు.ఈ విధమైనటువంటి పరిస్థితులలో ఈ జాగ్రత్తలను పాటించడం ద్వారా కరోనా మహమ్మారి నుంచి విముక్తి పొందవచ్చు.

పాటించాల్సిన పద్దతులు:
*కరోనా సోకిన వ్యక్తి మన ఇంట్లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు మొత్తం ఎల్లప్పుడు మాస్కు ధరించి ఉండాలి. ఎలాంటి పరిస్థితులలో కూడా మాస్క్ తొలగించకూడదు.

*కరోనా సోకిన వ్యక్తి ధరించిన బట్టలు ప్రత్యేకమైన క్రిమిసంహారక రసాయనాలతో ఉతకాలి. అతను ఉపయోగించిన వస్తువులను ఇతర కుటుంబ సభ్యులు ఎలాంటి పరిస్థితులలో ఉపయోగించకూడదు.

  • ఒకవేళ మన ఇంట్లో ప్రత్యేకమైన టాయిలెట్ లేకపోతే తరచూ టాయిలెట్ ను క్రిమిసంహారక మందులతో పిచికారీ చేస్తూ శుభ్రం చేస్తుండాలి.
  • కరోనా వ్యాపించిన వ్యక్తి వాడి పడేసిన వస్తువులను ఒక పసుపు రంగు బయో హజర్డాస్‌ బాక్స్‌లో వేయాలి.

చేయకూడని పనులు:

  • కరోనా బారిన పడిన వ్యక్తి గదిలోకి ఇతర కుటుంబ సభ్యులు నేరుగా ప్రవేశించకూడదు. ఎందుకంటే అతను నివశించే ఆ గది మొత్తం ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది. దీని వల్ల వైరస్ ఇతరులకు వ్యాపించే అవకాశం ఉంటుంది.
  • తరచూ చేతులను శానిటైజర్ చేస్తూ ఉండాలి. భోజనానికి ముందు చేతులను శుభ్రంగా సబ్బుతో కడగాలి. ఎలాంటి పరిస్థితులలోనూ రోగి వాడి పడేసిన వస్తువులను చేతులతో తాకకూడదు.
  • కరోనా సోకిన వ్యక్తి ఇంట్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నాడంటే ఇతర కుటుంబ సభ్యులు ఎవరు బయట వ్యక్తులతో కాంటాక్ట్ అవ్వకూడదు. ఈ విధమైనటువంటి జాగ్రత్తలను పాటించినప్పుడే వైరస్ ఇతరులకు వ్యాపించకుండా ఉంటుంది.

గ్యాస్ సిలిండర్ లో గ్యాస్ ఎంత ఉందో తెలుసుకోవాలా.. పాటించాల్సిన చిట్కా ఇదే..?

దేశంలో కోట్ల సంఖ్యలో కుటుంబాలు వంట కోసం గ్యాస్ సిలిండర్ ను ఉపయోగిస్తున్నాయి. ధరలు పెరుగుతున్నప్పటికీ సిలిండర్ ద్వారా సులభంగా వంట చేసే అవకాశం ఉండటంతో చాలామంది గ్యాస్ సిలిండర్ వినియోగించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే గ్యాస్ సిలిండర్ లో ఎంత గ్యాస్ ఉందనే విషయం గురించి మనకు తప్పనిసరిగా అవగాహన ఉండాలి. అకస్మాత్తుగా గ్యాస్ అయిపోతే ఇబ్బందులు పడక తప్పదు.

సింగిల్ సిలిండర్ ను వినియోగించే వాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా ఒకటి కంటే ఎక్కువ గ్యాస్ సిలిండర్లను వినియోగించే వాళ్లకు మాత్రం ఇబ్బందులు తప్పవు. అయితే చిన్న చిట్కాను పాటించడం ద్వారా సులువుగా సిలిండర్ లో గ్యాస్ ఎంత ఉందో సులభంగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం గ్యాస్ సిలిండర్ ను తడిగుడ్డతో తుడవాలి. గ్యాస్ సిలిండర్ ను తుడిచిన చోట ఎక్కడివరకు తడి వేగంగా ఆరిపోతుందో అక్కడివరకు సిలిండర్ లో గ్యాస్ అయిపోయిందని భావించాలి.

అలా కాకుండా తడి త్వరగా మొత్తం ఆరిపోతే గ్యాస్ సిలిండర్ అయిపోయే అవకాశం ఉందని భావించాలి. ఉదాహరణకు గ్యాస్ సిలిండర్ లో సగం గ్యాస్ ఉంటే గ్యాస్ ఉన్న భాగం కాకుండా మిగిలిన భాగంలో తడి వేగంగా ఆరుతుంది. ఈ విధంగా ఎంత గ్యాస్ ఉందో సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా చేయడం ద్వారా గ్యాస్ సిలిండర్ కోసం ముందుజాగ్రత్త పడే అవకాశం ఉంటుంది.

గ్యాస్ సిలిండర్ ను ఎత్తి బరువు చూసి గ్యాస్ ఎంత ఉందో తెలుసుకునే అవకాశం ఉన్నా అలా చేస్తే కచ్చితంగా గ్యాస్ ఎంత ఉందో తెలుసుకునే అవకాశం ఉండదు. అలా కాకుండా ఈ చిట్కాను పాటించడం ద్వారా సులభంగా గ్యాస్ సిలిండర్ లో గ్యాస్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు.

తరుచూ తుమ్ములు వస్తున్నాయా. అయితే ఈ చిట్కాలు పాటించండి..!

సాధారణంగా కొంతమందికి చలికాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల తరచు తుమ్ములు వస్తూ ఉంటాయి. ఈ విధంగా తుమ్ములు రావడం వల్ల ఎంతో చికాకుగా, ఇబ్బందిగా ఉంటుంది. తుమ్ములు తగ్గడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎలాంటి ఫలితం ఉండదు. మరికొంతమందికి వాతావరణంతో సంబంధం లేకుండా ఎక్కువగా తుమ్ములు వస్తుంటాయి. ఈ విధంగా అధికంగా తుమ్ముల సమస్యతో బాధపడేవారు తొందరగా తుమ్ములు తగ్గాలంటే ఈ సులభమైన చిట్కాలను పాటించడం ద్వారా తుమ్ముల నుంచి విముక్తి పొందవచ్చు.

వాతావరణంలో మార్పులు లేదా కాలుష్యం కారణంగా తరచూ తుమ్ములు వచ్చే వారు డాక్టర్ ను సంప్రదించి ఎన్నో మందులు వాడుతున్నప్పటికీ కొందరిలో ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాంటి సమయంలో మన వంటిల్లు నుంచి ఈ సమస్యకు ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు. మన వంటింట్లో దొరికే మసాలా దినుసులు వల్ల తరుచూ వచ్చే తుమ్మల నుంచి పూర్తిగా విముక్తి పొందవచ్చు.

మన ఇంటిలో దొరికే కొద్దిగా మెంతులు, వాము, మిరియాలు వీటన్నింటిని విడివిడిగా వేయించి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తరువాత వీటిని బాగా పొడి చేసి విడివిడిగా నిల్వచేసుకోవాలి.పొడిగా చేసుకొని ఉన్న ఈ దినుసులను ఒక్కొక్కటి 25 గ్రాముల చొప్పున కలిపి ఉంచుకోవాలి. ప్రతిరోజు ఉదయం ఒక తమలపాకులో ఒక గ్రాము చూర్ణం, అర టీ స్పూన్ తేనె కలిపి ఆకు మొత్తం చుట్టి, ఆ ఆకును నమిలి మింగాలి. ఈ విధంగా కొద్దిరోజుల పాటు చేయటం వల్ల తరచు తుమ్ములు రావడం తగ్గిపోవడమే కాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది. మన శరీరంలో రోగనిరోధక శక్తి మెరుగుపడటం వల్ల మన శరీరంలో అలర్జీ తత్వం తగ్గి ఈ సమస్యకు చక్కటి పరిష్కారం లభిస్తుంది.

శీతాకాలంలో పొడిచర్మానికి సులభంగా చెక్ పెట్టే చిట్కాలివే..?

శీతాకాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ పొడిచర్మం సమస్య వేధిస్తూ ఉంటుంది. చర్మం పొడిగా మారడం వల్ల కొందరు దురదలతో బాధ పడుతూ ఉంటారు. చలికాలంలో చాలామందికి చర్మం తెల్లగా మారడం, చర్మంపై పగుళ్లు కనిపించడం జరుగుతుంది. శరీరంలో తేమ తక్కువైనా, చర్మ సంరక్షణ పద్ధతులు పాటించకపోయినా, అనువైన దుస్తులు ధరించకపోయినా పొడిచర్మం సమస్య వేధిస్తూ ఉంటుంది. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా పొడిచర్మం సమస్యకు చెక్ పెట్టవచ్చు.

చాలామంది చలికాలంలో ఎక్కువగా నీటిని తాగరు. తక్కువగా నీటిని తాగడం వల్ల చర్మం పొడిబారుతుంది. అందువల్ల ప్రతిరోజూ ఖచ్చితంగా తగింత నీటిని తీసుకోవాలి. రిచ్ గా, ఆయిల్ బేస్ గా ఉండే మాయిశ్చరైజర్ ను ఎంచుకోవాలి. వీలైనంత వరకు ఆర్గానిక్ ఉత్పత్తులను వాడటం ద్వారా పొడిచర్మం సమస్యకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. చలికాలంలో సాధారణంగా హ్యూమిడిటీ తక్కువగా ఉంటుంది.

హ్యుమిడిఫైయర్ ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల హ్యూమిడిటీ సమస్యకు చెక్ పెట్టవచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్న కూరగాయలను తీసుకోవడం ద్వారా పొడిచర్మం సమస్యకు సులువుగా చెక్ పెట్టవచ్చు. చలికాలంలో గోరువెచ్చని నీటితో రోజూ స్నానం చేయడం ద్వారా పొడి చర్మం సమస్యకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. చలికాలంలో కెమికల్స్ తో తయారైన సబ్బులను వినియోగించక పోవడమే మంచిది.

ప్రతిరోజూ దానిమ్మ పండు తినడం లేదా దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల పొడిచర్మం సమస్యకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. సాల్మన్, ఆలివ్ ఆయిల్, వాల్నట్స్ తీసుకోవడం ద్వారా శరీరానికి కావాల్సినంత ఓమేగా 3 లభించి చర్మం మృదువుగా మారే అవకాశం ఉంటుంది.