Tag Archives: tirupathi

Silk Smitha: అచ్చం సిల్క్ స్మితని తలపించే అందం.. సిల్క్ స్మిత బ్రతికే ఉందా?

Silk Smitha: గ్లామర్ బ్యూటీ సిల్క్ స్మిత గురించి తెలియని వారంటూ ఉండరు. బోల్డ్ లుక్, హస్కీ వాయిస్, గ్లామర్‌తో రచ్చ చేసిన ఈ బ్యూటీ ఆ రోజుల్లో యువకుల గుండెల్లో మంటలు రేపింది. ఈమె తన అందాలతో , మత్తెక్కించే కళ్లతోనే అందరినీ మాయ చేస్తూ హీరోయిన్స్‌కు కూడా గట్టిపోటీనిచ్చింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయం భాషలలో ఎందరో స్టార్ హీరోలతో జత కట్టింది.

స్టార్ హీరోలు సైతం ఆమె డేట్స్ కోసం ఎదురుచూసేవారు అంటే ఆమెకి ఉన్న ఫాలోయింగ్ ఎమిటో మనకి అర్థమవుతుంది. ఏ హీరో సినిమా అయినా సరే సిల్క్ స్మిత పాట తప్పకుండా ఉండాలి . ఆమె పాట ఉంటేనే సినిమా హిట్టు అవుతుందని అనే నమ్మకం ఏర్పడింది. స్టార్ హీరోయిన్స్ కన్నా ఎక్కువ స్టార్‌డం సంపాదించుకుంది. ఇలా ఇండస్ట్రీలో తన అందాలతో ఒక ఊపు ఊపిన సిల్క్ స్మిత ఉన్నట్లుండి ఆత్మహత్య చేసుకొని మృతి చెందింది.

ఇప్పటికీ ఆమె లేని లోటు ఇండస్ట్రీలో ఉంది. అయితే సిల్క్ స్మిత లేని లోటు పూర్తి చేయడానికి మళ్లీ ఇన్నేళ్లకు సిల్క్‌ స్మితే జనాల ముందుకు వచ్చేసింది. అచ్చం సిల్క్ స్మితని పోలిన అందంతో జూనియర్ సిల్క్ స్మిత అందరిని అలరిస్తోంది.ఈమెను చూస్తే నిజంగా సిల్క్‌ స్మితనే మళ్ళీ పుట్టిందా అనిపిస్తుంది . అదేలా సాధ్యం అంటే.. ఇదుగో ఇలా అంటుంది జూనియర్‌ సిల్క్‌ స్మిత అలియాస్‌ విష్ణు ప్రియ. ఫేస్‌కట్‌, ఎక్స్‌ప్రెషన్స్‌తో సిల్క్‌ స్మితను గుర్తు చేస్తోన్న విష్ణు ప్రియ అనే యువతీ టిక్ టాక్ వీడియోస్ ద్వారా బాగా ఫేమస్ అయ్యింది.

Silk Smitha: సిల్క్ స్మిత పోలికలతో విష్ణు ప్రియ…


తిరుపతికి చెందిన విష్ణు ప్రియ అచ్చం సిల్క్ స్మిత లాగా ఉండటంతో టిక్ టాక్ వీడియోస్ లో బాగా ఫేమస్ అయ్యింది. ఈ అమ్మడికి తమిళ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి. తాజాగా తెలుగులో ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న జూనియర్ సిల్క్ స్మిత తాను అలా ఉండటానికి గల కారణాలు గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఇక ఈమెను చూసిన అభిమానులు సిల్క్ స్మిత బ్రతికే ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Karate Kalyani: గోవింద నామస్మరణ చేయనివ్వకుండా గొంతులు నొక్కేస్తున్నారు: కరాటే కళ్యాణి

Karate Kalyani: కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించి తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడిని దర్శించుకోవడానికి సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా తరచూ తిరుమలకి వస్తూ ఉంటారు. తాజాగా సినిమా నటి కరాటే కళ్యాణి కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం నిమిత్తం తిరుమల చేరుకుంది. అయితే అక్కడ భక్తులకు గోవింద నామ స్మరణ చేయనివ్వకుండా అడ్డుకుంటున్నారని కరాటే కళ్యాణి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

కరాటే కళ్యాణి ఇటీవల తిరుపతిలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తిరుమలలో తనకి ఎదురైన సమస్యల గురించి మీడియా ముందు లేవనెత్తింది. తిరుమల కొండపై స్వామివారి దర్శనానికి వెళితే గోవిందా.. గోవిందా అని దేవుని నామస్మరణ చేస్తుంటే.. అడ్డుపడుతున్నారని వెల్లడించింది. దేవుణ్ని మొర పెట్టుకునేందుకు వస్తే.. గోవిందా అనకుండా మా గొంతు నొక్కుతున్నారని వెల్లడించింది.

తిరుమలలో టీటీడీ ఉద్యోగులు పెత్తనం చేస్తున్నారని, పవిత్రమైన తిరుమల దేవస్థానంలో పనిచేస్తూ సాంప్రదాయమైన దుస్తులు ధరించడం లేదని సాంప్రదాయాలు పాటించడం లేదని తెలిపింది. ఇలా హిందూ సంప్రదాయాలను గౌరవించకుండా.. వెంకటేశ్వరుని అవమానిస్తే ఊరుకునేది లేదని అన్నారు. తిరుమల పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్నామని, సేవ్ తిరుమల హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తామని తెలియచేసింది.
అలాగే ఆహారం విషయంలో కూడా రేట్లు ఇష్టాను సారంగా నడుస్తున్నాయని, ఓ కుటుంబం తిరుమలకు వస్తే వాటర్ బాటిళ్లకే బోలెడంత ఖర్చు పెడుతున్నారని అన్నారు.

Karate Kalyani: స్వామి వారిని అవమానిస్తే ఊరుకునేది లేదు…


టాక్సీ రేట్లు కూడా అధికంగా ఉన్నాయని, ఈ పరిణామాలు చూస్తుంటే భక్తులను దూరం చేయటానికి ఇలా చేస్తున్నారని తెలిపింది. అలాగే ఈ సందర్భంగా డ్రోన్ విషయంపై కూడా ఆమె స్పందిస్తూ.. తొలుత అదేమీ లేదన్న టిటిడి, ఆ తర్వాత ఎవరి పేరో చెప్పి ఫైన్ వేసి చేతులు దులుపుకున్నారని తెలిపింది. వకుళ మాత ఆలయంలో చోరీ జరిగిందని పేర్కొన్నారు. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని టీటీడీ చైర్మన్ ధర్మారెడ్డికి విన్నవించినట్టు తెలిపింది. ఈ సమస్యల గురించి ఉద్యమం చేపట్టకముందే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం కరాటే కళ్యాణి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Tirupati MP: తిరుపతి ఎంపీకి టోకరా..! దాదాపు రూ.5 కోట్ల వరకు..!

Tirupati MP: నేరాల తీరు మారుతోంది. గతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగతనాలు, దోపిడీలు చేశారు. అయితే ఇప్పుడు ఏకంగా మనకు తెలియకుండానే మన డబ్బులను టెక్నాలజీ సహాయంతో దొంగిలిస్తున్నారు.

Tirupati MP: తిరుపతి ఎంపీకి టోకరా..! దాదాపు రూ.5 కోట్ల వరకు..!

ఓటీపీ ఫ్రాడ్స్, లాటరీ వచ్చిందని ప్రజల్ని మోసాలు చేయడం ఇటువంటి కేసులు పెరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఏదో చదువుకోని వారు మోసపోతున్నారంటే.. ఏమో అనుకోవచ్చు, కానీ చదువుకుంటూ… ఉన్నత ఉద్యోగాలు చేసే వారు కూడా సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్నారు. 

ఎంపీ అర్బన్ ఎస్పీకి లిఖితపూర్వకంగా..

తాజాగా రాజకీయ నాయకులు కూడా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. తాజాగా తిరుపతి ఎంపీ గురుమూర్తికి సైబర్ చీటర్ ఫోన్ కాల్ చేశాడు. సీఎంఓ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తూ… తనను అభిషేక్ అనే వ్యక్తిగా పరిచయం చేసుకున్నాడు. ఖాదీ పరిశ్రమ సబ్సిడీ రుణాల కింద రూ. 5 కోట్లు మంజూరైనట్లు నమ్మబలికాడు. 


ఎంపీ అర్బన్ ఎస్పీకి లిఖితపూర్వకంగా..

ఇదిలా ఉంటే మంజూరైన రుణాలు కావాలంటే తన అకౌంట్ డబ్బులు వేయాలన్న అభిషేక్.. 25 దరఖాస్తులకు ఒక్కొక్క దానికి రూ. 1.5 లక్షలు వేయాలని డిమాండ్ చేశారు. దీంతో అనుమానం వచ్చిన తిరుపతి ఎంపీ గురుమూర్తి… వెంటనే సీఎంఓ కార్యాలయానికి ఫోన్ చేసి విషయంపై ఆరా తీశారు. ఆ పేరుతో ఎవరూ లేరని నిర్థారించుకున్న తరువాత.. ఎంపీ అర్బన్ ఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. మెయిల్ ద్వాారా వివరాలను ఎంపీ, ఎస్పీకి పంపించాడు. ఎంపీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సైబర్ చీటర్ ను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.

తిరుమలకు వెళ్లే భక్తులకు గమనిక.. కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ పాలక మండలి..

తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. అక్కడ ఎప్పుడూ భక్తులతో ఆలయం కిటకిటలాడుతూ ఉంటుంది. నిత్య తోరణం పచ్చ కల్యాణం లాగా ఎప్పుడూ ఆ శ్రీనివాసుడు పూజలు అందుకుంటాడు. అయితే ఇటీవల తిరుమల దర్శనానికి సంబంధించి టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలను తీసుకుంటుంది.

ఇటీవలే సర్వదర్శనం కోటాను పెంచిన టీటీడీ.. దీనికి అనుగుణంగా నిబంధనలు కఠినతరం చేస్తోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి నిర్ణయాలను తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. సర్వ దర్శనం టోకెన్లు సెప్టెంబర్ 25 నుంచి ఆన్ లైన్లో అందుబాటలో ఉంటాయని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. రోజుకు 8 వేల టికెట్లను అందుబాటులో ఉంచుతామన్నారు.

అంతే కాకుండా దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకొని.. సర్టిఫికెట్ లేదా కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ కూడా తీసుకురావాలని పేర్కొన్నారు. ఆన్ లైన్ టికెట్ల జారీ తర్వాత ఇక ఆఫ్ లైన్లో టికెట్లను జారీ చేయమన్నారు. టికెట్ల వద్ద భక్తులు గూమిగూడటంతో కరోనా వ్యాప్తి పెరిగే అవకాశం ఉన్నందును ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

ఆన్ లైన్ లో టికెట్ ధర రూ.300 గా పేర్కొన్నారు. తిరుమలకు వచ్చే భక్తులు ఈ విషయాలను గుర్తుంచుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు నియంత్రణలో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నారు.

తండ్రిలాంటి వాడని అతడి బైక్ ఎక్కిన బాలిక.. చివరకు అతడు ఎంతటి ఘోరానికి పాల్పడ్డాడంటే..

ఆడపిల్ల బయటకు వచ్చిందంటే చాలు.. కామంతో కల్లు మూసుకుపోయిన కామాంధులు వావివరసలు మరచిపోయి రెచ్చిపోతున్నారు. ఎక్కడ చూసినా హత్యలు, ఆత్యాచార వార్తలే వినిపిస్తున్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చినా వీళ్లలో మాత్రం మార్పు రావడం లేదు. ఈ రోజుల్లో బంధువులను నమ్మి వారితో పంపించాలన్న భయపడాల్సి పరిస్థితి వచ్చింది. ఎవరి మదిలో ఎలాంటి విషపు ఆలోచన దాగి ఉందో..! ఎవరి నుంచి ప్రమాదం పొంచి ఉందో ముందే గ్రహించడం చాలా కష్టంగా మారుతోంది.

రేషన్ కోసం అని బంధువుతో తన కూతరును పంపించారు తల్లిదండ్రులు. వరుసకు పెద్దనాన్నతో రేషన్ షాపుకు వెళ్ళింది ఆ బాలిక. కానీ ఆ కామాంధుడి కన్ను కూతరు వయస్సున్న ఆ బాలికపై పడింది. పొదల్లోకి వెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గౌనిగానిపల్లెలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని తల్లి తండ్రులతో కలసి జీవనం సాగిస్తోంది. రేషన్ కోసమని ఆ బాలిక పెద్దనాన్న అయిన గంగులప్పతో పంపించారు తల్లిదండ్రులు. రేషన్ బియ్యం, సరుకులు తీసుకోని తిరుగు ప్రయాణం అయ్యారు.

అతడికి అప్పటికే పెళ్లైన ఇద్దరు కుమార్తెలు, కొడుకు కూడా ఉన్నారు. కుమారుడికి రెండేళ్ల క్రితం వివాహం కూడా చేశాడు. అయితే ఆ కామాంధుడి కన్ను కూతురు వరుసైన ఆ బాలికపై పడింది. ఇంటికి వెళ్లే క్రమంలో దారి మధ్యలో బైక్ ఆపి.. పక్కనే ఉన్న పొదల్లోకి తీసుకెళ్లాడు. ఇదేంటి పెద్దనాన్న ఇక్కడకు తీసుకొచ్చావ్.. అని ప్రశ్నించగా.. తన కోరిక తీర్చాలని బలవంతంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ బాలిక పెద్దగా అరిచింది. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో.. ఆమె అరుపులకు ఉపయోగం లేకుండా పోయింది. ఎలాగోలా అక్కడ నుంచి ఆమె అతడి చెర నుంచి తప్పించుకొని పరుగున తన ఇంటికి చేరుకుంది.

ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పకుండా.. అఘాయిత్యాన్ని తలుచుకొని సబ్బు నీళ్లను తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను తల్లితండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఎందుకు ఈ పని చేశావని ఆ బాలికను నిలదీయగా.. జరిగిన ఘోరాన్ని వివరించింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధిత కుటుంబసభ్యులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

చేపల చెరువులో బయటపడ్డ పురాతన విగ్రహాలు.. ఎక్కడంటే..

అప్పుడప్పడు మనం వార్తల్లో వింటూ ఉంటాం.. ఆ ఊరిలో పొలాలు దున్నుతుండగా.. ఇంటికి పునాదులు తవ్వుతుండగా.. మైనింగ్ చేస్తున్నప్పుడు పురాతన విగ్రహాలు , సంపద బయటపడుతుంటాయని. వీటిలో ఎక్కువగా దేవతల విగ్రహాలే బయటపడుతుంటాయి. కానీ ఓ చేపల చెరువులో పురాతన విగ్రహాలు బయటపడ్డాయి.

దీంతో జనాలు ఆశ్చర్యపోయారు. ఇలాంటి వాటి కోసం కొందరు ఆలయాల్లోనూ, చారిత్రక ప్రదేశాల్లోనూ తవ్వకాలు జరుపుతుంటారు. అలా కాకుండా ఓ చేపల చెరువులో పురాతన విగ్రహాలు బయటపడటంతో జనం ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు విష్ణుమూర్తి, శివలింగం ఒకేచోట లభ్యం కావడంతో అద్భుతమంటున్నారు. ఈ అరుదైన ఘటన ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా, పాకాల మండలం పెదగోల్పాడు గ్రామంలోని బావి రాగన్న చెరువులో చేపల కోసం మోటర్ తో నీటిని తోడుతుండగా విగ్రహాలు కనిపించాయి.

ఒకే చోట ఇలా విష్ణుమూర్తి, శివలింగం విగ్రహాలు బయటపడ్డాయి. దీంతో స్థానికులు కాస్త ఆశ్చర్యానికి లోనయ్యారు. తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇవి బంగారంతో చేసిన విగ్రహాలు కాదు.. కంచుతో చేసినవి. మూడు అడుగుల విఘ్ణమూర్తి, శివలింగాన్ని సమీపంలోని ఆలయానికి తరలించారు.

విగ్రహాలు స్వతహాగా చెరువులో బయటపడ్డాయా లేక ఎవరైనా దొంగిలించి చెరువులో పడేశారా..? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆ మండల ఎమ్మార్వో సమక్షంలో వివరాలను నమోదు చేశారు పోలీసులు. అనంతరం పరావస్తు శాఖ అధికారులకు సమాచారం అందించి.. విగ్రహాలను ట్రెజరీకి తరలించారు.

సర్జరీ తర్వాత అలా అయిపోయిన ఎమ్మెల్యే రోజా..?

నటిగా ,రాజకీయ అభ్యర్థిగా ఎంతో చురుగ్గా ఉండే రోజా ప్రస్తుతం ఇంటికే పరిమితమైన సంగతి మనకు తెలిసిందే. గత కొద్ది రోజుల క్రితం ఆమె రెండు మేజర్ సర్జరీలు చేయించుకున్న క్రమంలో ఆమె ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు.రాజకీయాలలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే రోజా ప్రస్తుతం ఇంట్లో ఉన్నప్పటికీ తన అధికారిక కార్యక్రమాలను ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారు.

తన నియోజకవర్గంలో సమస్యలు, కరోనా కట్టడి విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి పది రోజుల నుంచి ఆన్ లైన్ ద్వారా అధికారులతో ఆమె టచ్ లో ఉన్నారు. ఈ క్రమంలోనే నియోజకవర్గ ముఖ్యపట్టణమైన పుత్తూరు మునిసిపాలిటీ అధికారులు, నేతలతో రోజా జూమ్ మీటింగ్ ద్వారా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కరోనా కట్టడి చర్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులతో మాట్లాడారు.

కరోనాతో బాధపడుతున్నవారు ఆసుపత్రిలో చేరకుండా హోమియోపతి, అల్లోపతి వంటి మందులను వాడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నగరి నియోజకవర్గ ప్రజలకు తెలిపారు. ముఖ్యంగా ఈ దశ తీవ్ర స్థాయిలో వ్యాపిస్తున్న క్రమంలో యువత కూడా మరణిస్తున్నారు.ఈ క్రమంలో ప్రతి ఒక్కరు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ ఉన్న సమయంలో రోడ్లపై విచక్షణారహితంగా ప్రవర్తించే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు.ఈ విధంగా రోజా సర్జరీ తర్వాత ఇంటికే పరిమితమైన తన విధులను ఎంతో చక్కగా నిర్వహించడంతో ఈమె ఎక్కడున్నా ఫైర్ బ్రాండ్ అని మరోసారి నిరూపించుకున్నారు.

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. రాతపరీక్ష లేకుండా 800 ఉద్యోగాలకు నోటిఫికేషన్..?

ఈ మధ్య కాలంలో ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ప్రైవేట్ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్లను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏపీఎస్‌ఎస్‌డీసీ నుంచి మరో నోటిఫికేషన్ విడుదలైంది. అమర్ రాజా గ్రూప్ కంపెనీలో 800 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల కాగా రాత పరీక్ష లేకుండా ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టనున్నారు.

అమర్ రాజా కంపెనీ ఈ నోటిఫికేషన్ ద్వారా 800 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. హెచ్ఆర్ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 10,500 రూపాయలు వేతనంగా లభిస్తుంది. కంపెనీ ఫుడ్, ట్రాన్స్ పోర్ట్, వసతి, ఇతర సదుపాయాలను ఉద్యోగాలకు ఎంపికైన వారికి కల్పిస్తారు. https://www.apssdc.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. స్కిల్ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్ ఆధ్వర్యంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు శిక్షణ ఉంటుంది. శిక్షణ అనంతరం అభ్యర్థులు అమర్ రాజా సంస్థలో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలపై ఆసక్తి ఉంటే జనవరి 1వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

పది ఇంటర్ పాస్ అయినవారితో పాటు ఫెయిల్ అయిన వారు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు డిప్లొమో, డిగ్రీ, బీటెక్ చదువులు మధ్యలో ఆపేసిన వారు సైతం ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రేపటి వరకు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండటంతో వీలైనంత త్వరగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది.