Tag Archives: tollywood film indursty

Director Teja: కొడుకు కోసం 30 కోట్ల భారీ బడ్జెట్ చిత్రం ప్లాన్ చేసిన తేజ… పెద్ద సాహసమే చేస్తున్నారుగా?

Director Teja: డైరెక్టర్ తేజ ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు. ఈయన దర్శకత్వంలో సినిమా వచ్చింది అంటే మినిమం సినిమా గ్యారంటీ అనే టాక్ ఉంటుంది. ఇప్పటివరకు ఈయన దర్శకత్వంలో సినిమాలు చేసిన నిర్మాతలు పెద్దగా నష్టపోయిన దాఖలాలు లేవు. ఎందుకంటే బడ్జెట్ విషయంలో తేజ ఆచితూచి అడుగులు వేస్తారు. ఈయన సినిమా బడ్జెట్ చాలా తక్కువలో పూర్తి చేయడం వల్ల నిర్మాతలకు పెద్దగా నష్టాలు రావని చెప్పాలి.

Director Teja: కొడుకు కోసం 30 కోట్ల భారీ బడ్జెట్ చిత్రం ప్లాన్ చేసిన తేజ… పెద్ద సాహసమే చేస్తున్నారుగా?

ఈ విధంగా ఈయన అప్పట్లో తెరకెక్కించిన చిత్రం సినిమా కేవలం 30 లక్షలలో పూర్తి చేశారు. ఇకపోతే ప్రస్తుతం తేజ తన కుమారుడను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని భావిస్తున్నారట. దీంతో ఏకంగా తన కొడుకు కోసం 30 కోట్ల భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తేజ కుమారుడు అమితోవ్‌ విక్రమాదిత్య పేరుతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు.ఈ క్రమంలోనే ఈయన హీరోగా తెరకెక్కే ఈ సినిమాని భారీ బడ్జెట్ చిత్రంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

తేజ తన కొడుకుని లాంచ్ చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి భారీ బడ్జెట్ చిత్రం ప్లాన్ చేశారు అనుకుంటే పొరపాటే. స్వాతంత్రానికి ముందు జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా రాబోతోందట. దీంతో ఈ సినిమా షూటింగ్ కోసం భారీ సెట్ వేయాల్సి రావడంతో అధిక ఖర్చు అవుతుందని, అలాగే కాస్టింగ్ విషయంలో కూడా ఎక్కువమంది అవసరం కావడంతో ఈ సినిమాకు ఈ రేంజ్ లో ఖర్చు అవుతుందని తెలుస్తుంది.

Director Teja: కొడుకు కోసం 30 కోట్ల భారీ బడ్జెట్ చిత్రం ప్లాన్ చేసిన తేజ… పెద్ద సాహసమే చేస్తున్నారుగా?

తేజ కెరియర్ లో మొట్టమొదటి భారీ బడ్జెట్ సినిమా ఇదే..

ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులలో తేజ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక ఈ సినిమా తేజ దర్శకత్వంలోని తెరకెక్కనుంది. త్వరలోనే ఈ సినిమా గురించి పూర్తి సమాచారాన్ని అందించనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే తేజ సినీ కెరియర్ లో అత్యంత భారీ బడ్జెట్ సినిమా ఇదే. మరి ఈ సినిమాతో తేజ ఎలాంటి ఫలితాలను అందుకుంటారో వేచి చూడాలి.

Vijayendra Prasad: రాజ్యసభకు ఎంపికైన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఇళయరాజాకు అరుదైన గౌరవం?

Vijayendra Prasad: భారత రాజ్యాంగం ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా ఎవరైతే వివిధ రంగాలలో సేవలు అందిస్తూ దేశ ప్రతిష్ఠను కాపాడుతారో అలాంటి వారికి రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి కోటాలో వారిని రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ క్రమంలోనే రాష్ట్రపతి కోటాలో భాగంగా నలుగురిని రాజ్యసభకు ఎంపిక చేసినట్లు ప్రధానమంత్రి వెల్లడించారు.

Vijayendra Prasad: రాజ్యసభకు ఎంపికైన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఇళయరాజాకు అరుదైన గౌరవం?

ఈ విధంగా రాజ్యసభకు ఎంపిక చేసిన వారిలో నలుగురు కూడా సౌత్ కు చెందిన సెలబ్రిటీలు కావడం గమనార్హం. వీరిలో ప్రముఖ రైటర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విజయేంద్ర ప్రసాద్ ను రాజ్యసభ సభ్యునిగా ఎంపిక చేశారు. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, క్రీడా రంగానికి చెందిన పి.టి.ఉష, ప్రముఖ ఫిలాంత్రాఫిస్ట్ అయిన ఇంద్ర వీర హెగ్డే ని కూడా రాజ్యసభకు నామినేట్ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించారు.

Vijayendra Prasad: రాజ్యసభకు ఎంపికైన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఇళయరాజాకు అరుదైన గౌరవం?

ఇకపోతే సినిమా రంగంలో కొన్ని దశాబ్దాల నుంచి విజయేంద్ర ప్రసాద్ ప్రముఖ రైటర్ గా ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఈయన రచించిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు. ఇది మాత్రమే కాకుండా ఆయన రచించిన బజరంగీ భాయిజాన్ సినిమాకి కూడా దేశవ్యాప్తంగా ఎంతో మంచి గుర్తింపు వచ్చింది.ఇకపోతే ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా విజయాల గురించి మనకు తెలిసిందే.

ఫోన్ చేసి అభినందించిన ప్రధానమంత్రి…

ఇళయరాజా సంగీతంలో వచ్చిన పాటలు ఇప్పటికీ శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.ఈయన కూడా గత కొన్ని దశాబ్దాల నుంచి సినీ ఇండస్ట్రీలో ఎన్నో సేవలు చేయడంతో ఇతనిని కూడా రాజ్యసభకు నామినేట్ చేశారు. ఈ విధంగా రాజ్యసభకు నామినేట్ అయిన వారికి స్వయంగా నరేంద్ర మోడీ ఫోన్ చేసి వారికి అభినందనలు తెలియజేశారు. ఇక సినీ పరిశ్రమకు చెందిన ఇద్దరికీ రాజ్యసభ సభ్యులుగా అవకాశం రావడంతో సినీ ప్రముఖులు వీరిద్దరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Lavanya Tripathi: నాగచైతన్యకు తల్లిగా చేయమన్నారు.. అందుకే నాగార్జున ఆఫర్ రిజెక్ట్ చేసాను.. : లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi: తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్, సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట అందాల రాక్షసి సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. ఈమె చివరగా నటించిన చిత్రం చావు కబురు చల్లగా. లావణ్య త్రిపాఠి తాజాగా నటించిన చిత్రం హ్యాపీ బర్త్ డే. ఈ సినిమా జూలై 8న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠి ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉంది.

Lavanya Tripathi: అక్కినేని నాగార్జున ఆఫర్ కు నో చెప్పడానికి అసలు కారణం ఇదే: లావణ్య త్రిపాఠి

తాజాగా ఒక మీడియాతో ముచ్చటించిన లావణ్య పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాగార్జునతో నటించిన సోగ్గాడే చిన్నినాయన చిత్రంలో లావణ్య త్రిపాఠి నటించిన విషయం తెలిసిందే. సోగ్గాడే చిన్నినాయనకు సిక్వెల్ గా వచ్చిన బంగార్రాజు సినిమాలు కృతి శెట్టిన హీరోయిన్ గా తీసుకున్నారు.. మరి మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా అని యాంకర్ ప్రశ్నించగా?ఆ విషయంపై స్పందించిన లావణ్య త్రిపాఠి.. నాగార్జున తనని అప్రోచ్ అయ్యారని, కానీ నాగచైతన్య లీడ్ రూల్ చేస్తున్నారని, నాగచైతన్యకు మదర్ పాత్ర పోషించాల్సి ఉంటుందని చెప్పారట.

Lavanya Tripathi: అక్కినేని నాగార్జున ఆఫర్ కు నో చెప్పడానికి అసలు కారణం ఇదే: లావణ్య త్రిపాఠి

నాగార్జునకు లావణ్య త్రిపాఠి నో చెప్పిందట..

సోగ్గాడే చిన్నినాయన నాగార్జునకు జోడిగా నటించిన లావణ్య త్రిపాఠి సీక్వేల్ గా వచ్చిన బంగార్రాజు సినిమాలో మాత్రం చేయాల్సి ఉంటుంది అని చెప్పారట. అయితే మొదటి నాగార్జున ఆ విషయం చెప్పడంతో లావణ్య త్రిపాఠి షాక్ అయ్యిందట. నాగచైతన్య సరసన నటించాల్సిన నేను ఆయనకు తల్లిగా నటించడం ఏంటి అంటూ తాను చేయను అని చెప్పి నాగార్జునకు నో చెప్పిందట లావణ్య త్రిపాఠి. కాగా బంగార్రాజు సినిమాలో తాత నాగార్జున పాత్రను ఉంచి తండ్రి నాగార్జున పాత్రని తీసేసిన విషయం తెలిసిందే. అలా లావణ్య అతను కూడా తీసేసి మేనేజ్ చేసేసారు చిత్ర బృందం

Sandalwood Smuggling: పుష్ప సినిమా తరహాలో స్మగ్లింగ్ సీన్ లను రిపీట్ చేసిన దొంగలు.. ఎక్కడో తెలుసా?

Sandalwood Smuggling: టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం పుష్ప. ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన విషయం తెలిసింది. పాన్ ఇండియా సినిమాగా విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా కలెక్షన్లను రాబట్టిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ టాక్ ను అందుకుంది. కాగా పుష్ప 2 సినిమాను అంతకుమించి ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా విడుదలైన తర్వాత మొదట పాజిటివ్ గా కంటె నెగిటివ్ గానే ఎక్కువగా వార్తలు వినిపించాయి.

Sandalwood Smuggling: పుష్ప సినిమా తరహాలో స్మగ్లింగ్ సీన్ లను రిపీట్ చేసిన దొంగలు.. ఎక్కడో తెలుసా?

అలాగే ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో అదేవిధంగా విమర్శలను సైతం ఎదుర్కొంది. మరియు ముఖ్యంగా సినిమాలో స్మగ్లింగ్ సీన్లపై చాలామంది విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే స్మగ్లింగ్ చేసేవారికి పుష్ప సినిమా ద్వారా కొత్త కొత్త ఐడియాలు ఇస్తున్నారు అంటూ విమర్శలు చేశారు. అంతేకాకుండా ఈ సినిమా విడుదలైన తర్వాత చాలా చోట్ల పుష్ప సినిమా తరహాలోనే స్మగ్గింగ్ సీన్లను రిపీట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. గుజరాత్ లోని పుష్ప మూవీని తలదన్నే రేంజ్ లో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు.

Sandalwood Smuggling: పుష్ప సినిమా తరహాలో స్మగ్లింగ్ సీన్ లను రిపీట్ చేసిన దొంగలు.. ఎక్కడో తెలుసా?

అంతేకాకుండా అందరూ పుష్ప రాజ్ గెటప్ లో అల్లు అర్జున్ బొమ్మ ఉన్న టీ షర్టులు ధరించడమే కాకుండా, సినిమాలో పుష్పరాజ్ మాదిరిగానే నడుముకు ఎర్ర టువాళ్లు చుట్టుకొని మరి స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారు. తాజాగా వీరిని పోలీసులు అరెస్టు చేయగా వారు పుష్ప గ్యాంగ్ గా ప్రచారం అవుతున్నారు. మధ్యప్రదేశ్ కు చెందిన ఈ గ్యాంగ్ గుజరాత్ లోని గ్రామాల్లో గుడారాలు వేసుకొని వనమూలికలు, దువ్వెనల విక్రయాల పేరుతో ఎర్రచందనపు చెట్లను దొంగలించి యూపీలో విక్రయిస్తూ ఉంటారు.

గుజరాత్ లో రెచ్చిపోయిన పుష్ప గ్యాంగ్..

అయితే ఈ ముఠాలో పిల్లలు మహిళలు కూడా ఉన్నారు. సౌత్ రాష్ట్రాలతో పాటు ప్రస్తుతం గుజరాత్ లాంటి ప్రాంతాల్లో కూడా ఎర్రచందనం చెట్లను పెంచడం ప్రారంభించారు. వీటి పెంపకంతో రైతులకు ప్రయోజనం కలిగించాలి అన్న ఉద్దేశంతో కేవలం అడవుల్లో మాత్రమే కాకుండా ప్రైవేట్ స్థలాల్లో కూడా ఎర్రచందనం చెట్ల పెంపకానికి ప్రభుత్వం కూడా అనుమతినిచ్చిందట. ప్రస్తుతం ఎర్రచందనానికి బాగా డిమాండ్ ఉండడంతో స్మగ్లింగ్ చేసే వారు మరింత రెచ్చిపోతున్నారు. మొదట వీరు ఊర్లో మూలికలు దువ్వెన విక్రయించడానికి వచ్చినట్లు నటించి, ఆ తర్వాత గుడారాలు ఏర్పాటు చేసుకుని పగటిపూట గ్రామం మొత్తం గాలించి ఎక్కడైతే ఎర్రచందనం ఉన్నాయా అని వెతికి చూస్తారట. ఆ తర్వాత అందరూ నిద్ర పోయిన తర్వాత ఎర్రచందనం చెట్లను నరికివేసి ఆ తర్వాత ఆ ముక్కలను భూమిలో దాస్తారట. ఆ తర్వాత అవి ఎవరికంటా పడకుండా రాష్ట్రం దాటించేస్తారట. అలా దాదాపుగా రెండున్నర నెలలుగా ఈ విధంగా చేస్తున్నట్లు పోలీసుల ముందు అంగీకరించారు పుష్ప గ్యాంగ్.