Director Teja: డైరెక్టర్ తేజ ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు. ఈయన దర్శకత్వంలో సినిమా వచ్చింది అంటే మినిమం సినిమా గ్యారంటీ అనే టాక్ ఉంటుంది. ఇప్పటివరకు ఈయన దర్శకత్వంలో సినిమాలు చేసిన నిర్మాతలు పెద్దగా నష్టపోయిన దాఖలాలు లేవు. ఎందుకంటే బడ్జెట్ విషయంలో తేజ ఆచితూచి అడుగులు వేస్తారు. ఈయన సినిమా బడ్జెట్ చాలా తక్కువలో పూర్తి చేయడం వల్ల నిర్మాతలకు పెద్దగా నష్టాలు రావని చెప్పాలి.
ఈ విధంగా ఈయన అప్పట్లో తెరకెక్కించిన చిత్రం సినిమా కేవలం 30 లక్షలలో పూర్తి చేశారు. ఇకపోతే ప్రస్తుతం తేజ తన కుమారుడను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని భావిస్తున్నారట. దీంతో ఏకంగా తన కొడుకు కోసం 30 కోట్ల భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తేజ కుమారుడు అమితోవ్ విక్రమాదిత్య పేరుతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు.ఈ క్రమంలోనే ఈయన హీరోగా తెరకెక్కే ఈ సినిమాని భారీ బడ్జెట్ చిత్రంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
తేజ తన కొడుకుని లాంచ్ చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి భారీ బడ్జెట్ చిత్రం ప్లాన్ చేశారు అనుకుంటే పొరపాటే. స్వాతంత్రానికి ముందు జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా రాబోతోందట. దీంతో ఈ సినిమా షూటింగ్ కోసం భారీ సెట్ వేయాల్సి రావడంతో అధిక ఖర్చు అవుతుందని, అలాగే కాస్టింగ్ విషయంలో కూడా ఎక్కువమంది అవసరం కావడంతో ఈ సినిమాకు ఈ రేంజ్ లో ఖర్చు అవుతుందని తెలుస్తుంది.
ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులలో తేజ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక ఈ సినిమా తేజ దర్శకత్వంలోని తెరకెక్కనుంది. త్వరలోనే ఈ సినిమా గురించి పూర్తి సమాచారాన్ని అందించనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే తేజ సినీ కెరియర్ లో అత్యంత భారీ బడ్జెట్ సినిమా ఇదే. మరి ఈ సినిమాతో తేజ ఎలాంటి ఫలితాలను అందుకుంటారో వేచి చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…