Tag Archives: vamde matharam

Anchor Anasuya: “వందే మాతరం” వివాదం.. నెటిజెన్ సలహాకు శివాలెత్తిన అనసూయ!

Anchor Anasuya: ఇటు బుల్లితెరపై అటు వెండితెర పై తన సత్తా చూపిస్తూ విజయపథంలో దూసుకుపోతున్న యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెండితెరపై ప్రస్తుతం ఎన్నో సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. సినిమాల్లో ఎంతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఇలా సోషల్ మీడియా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయపలు మార్లు దారుణంగా నెటిజన్ల ట్రోలింగ్ గురవుతుంటారు.

“వందే మాతరం” వివాదం.. నెటిజెన్ సలహాకు శివాలెత్తిన అనసూయ!

ఈ క్రమంలోనే నేడు గణతంత్ర దినోత్సవం కావడంతో అనసూయ సోషల్ మీడియా వేదికగా వందేమాతరం పాట పాడారు. ఈ క్రమంలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

“వందే మాతరం” వివాదం.. నెటిజెన్ సలహాకు శివాలెత్తిన అనసూయ!

ఈ నేపధ్యంలోనే ఒక నెటిజన్ స్పందిస్తూ మీ వాయిస్ చాలా బాగుంది సిస్టర్ అయితే నిలబడి పాడాల్సింది అంటూ ఓ నెటిజన్లు కామెంట్ చేస్తూ… మిమ్మల్ని బాధపెట్టి ఉంటే క్షమించండి అంటూ కామెంట్ చేశారు. ఇలా నెటిజన్ చేసిన కామెంట్ పై అనసూయ స్పందించారు.

బుర్ర అద్దెకు తెచ్చుకోండి…

ఈ సందర్భంగా అనసూయ స్పందిస్తూ..లేచి నిలబడి పాడటానికి ఇది జాతీయ గీతం జనగణమన కాదు. జాతీయ గేయం వందేమాతరం అని తెలిపారు. వందేమాతరం గేయాన్ని బంకించంద్ర చటర్జీ రచించారు. నేను కూడా ఇండియన్ నాకు కూడా గౌరవం ఉంది అంటూ రిప్లై ఇచ్చారు. అలాగే ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా స్పందిస్తూ.. మీలోల్లి ఏంటి.. నేషనల్ యాంతం అంటారు గాంధీ కాన్స్టిట్యూషన్ కి సంబంధం ఏంటి అంటారు మరి జనగణమన ఏంటి ఆగస్టు 15 1947 అయితే 26 జనవరి 1950 అయింది. కొంచెం బుర్ర అద్దెకు తెచ్చుకుని మాట్లాడండి అంటూ ఫైర్ అయ్యారు.