Tag Archives: vanitha vijaykumar comments about bunny

అల్లు అర్జున్ నా వైపు అలా చూసేవాడు : వనితా విజయ్ కుమార్

వనితా విజయ్ కుమార్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నారు. నిత్యం ఏదో ఒక విషయం గురించి ఈమె వార్తల్లో నిలుస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం ఐదోసారి ప్రేమలో పడ్డానని తెలపడంతో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ప్రస్తుతం మరొకసారి అల్లు అర్జున్ గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ నా వైపు అలా చూస్తే వాడంటూ వనితా విజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు.

ప్రముఖ సినీ సెలబ్రిటీ విజయ్ కుమార్, మంజుల పెద్ద కుమార్తె అయిన వనితా విజయ్ కుమార్ 1995లో ‘చంద్రలేఖ’ అనే తమిళ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. చెన్నైలో తెలుగు పరిశ్రమ ఉన్న సమయంలో మెగాస్టార్ కుటుంబంతో ఎంతో సన్నిహితంగా ఉండటం వల్ల ఏ చిన్న కార్యాలకే నా కుటుంబ సభ్యులు అందరూ కలిసి మెగాస్టార్ ఇంటికి వెళ్ళేవారు అని పేర్కొన్నారు. చిరంజీవి గారు నటించిన ఇంగ్లీష్ సినిమా ఓపెనింగ్ కి వెళ్ళినప్పుడు అక్కడ అల్లు అర్జున్ తన వైపు అలా చూస్తూ లైన్ వేసేవాడిని, అప్పుడు నేను మామిడి పండు కలర్ డ్రెస్ వేసుకొని ఉన్నానని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆ సమయంలో అల్లు అర్జున్ కు 14 సంవత్సరాలు ఉంటాయని ఆమె తన కన్నా ఎంతో పెద్దది అని తెలిపింది.

వనితా విజయ్ కుమార్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్నారు. సినిమాలలో నటించి పాపులర్ అవడం కన్నా నిజ జీవితంలో ఏదో ఒక వివాదంతో ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నారు. ముగ్గురిని పెళ్లి చేసుకోవడమే కాకుండా మరో ఇద్దరితో ప్రేమలో ఉన్నట్టు ఈమె తెలిపారు. అదే ఇంటర్వ్యూలో వనితా బన్నీ గురించి మాట్లాడుతూ, బన్నీ ఒక మంచి డాన్సర్ అని, అవకాశం వస్తే బన్నీకి అత్త క్యారెక్టర్ లో నటించాలని ఉందని తెలిపారు. రమ్యకృష్ణ తరహాలో చాలా శక్తివంతమైన పాత్రలో నటించడానికి వనితా ఆసక్తి చూపుతున్నారని ఈ సందర్భంగా తెలిపారు. అయితే అవన్నీ ఎలా ఉన్నా ప్రస్తుతం బన్నీ తనకు లైన్ వేసాడనే సంచలన వ్యాఖ్యలు చేయడంతో వనితా విజయ్ కుమార్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.