Tag Archives: vc sajjanar

విద్యార్థుల కష్టాలు తీర్చిన టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్.. ఒక్క ట్వీట్ తోనే..

బస్సులపై అసభ్యకర పోస్టర్లు అంటించకుండా చర్యలు తీసుకున్నారు. ప్రయాణికులకు ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తే.. వెంటనే ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్నారు. ఇలా అతడు చేస్తున్న కార్యక్రమాలతో మర్పు స్పష్టంగా కనపడుతోంది.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్టీసీ ఉద్యోగులు, ప్రయాణికుల సమస్యలపై సజ్జనార్ స్వయంగా స్పందిస్తూ.. వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ ఆదాయాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు పలు సంస్కరణలకు వీసీ సజ్జనార్ నాంది పలికారు. ప్రయాణికులను ఆకట్టుకునే విధంగా పలు కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. ఎక్కువ మంది ఎక్కడికైనా వెళ్లాలంటూ.. బస్సులను బుక్ చేసుకునే వెసులు బాటును కూడా కల్పించారు. అంతేకాకుండా పెళ్లిళ్లకు ఆర్టీసీ బస్‌ను బుక్‌ చేసుకుంటే.. నూతన వధూవరులకు కానుకలు అందిస్తున్నారు.

బాలల దినోత్సవం సందర్భంగా 15 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత ప్రయాణం కల్పించారు. ఆర్టీసీ బ‌స్సుల్లో ఆక్యుపెన్సీ పెంచేందుకు, ప్రయాణికులను ఆక‌ట్టుకునేందుకు సజ్జనార్‌.. ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలకు నాంది పలుకుతున్నారు. తాజాగా మరో సమస్యకు పరిష్కారం చూపించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నుంచి కోటపల్లి మోడల్ స్కూల్‌కు వెళ్లేందుకు విద్యార్థులు పడుతున్న సమస్యలపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు కస్తూర్బా పాఠశాల ఉపాధ్యాయురాలు భారతి ట్వీట్ చేసింది.

విద్యార్థులు పడుతున్న ఇబ్బందులకు వీడియో తీసి పంపించారు. ఆ ట్వీట్ కు ఎండీ వెంటనే స్పందించి.. చర్యలు తీసుకోవాలని సంబంధిత డిపో అధికారులకు ఆదేశించాడు. వెంటనే వారి కి బస్సు సౌకర్యాన్ని కల్పించారు. దీనితో 200 మంది విద్యార్థులకు ఉపశమనం కలిగినట్లు అయింది. దీంతో అతడికి విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

బస్సు కండక్టర్ వద్ద చిల్లర తీసుకోవడం మర్చిపోయిన విద్యార్థి.. చివరకు ఏమైందంటే?

ఇటీవల ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన వీసీ సజ్జనార్ వివిధ రకాల సంచలనాత్మక నిర్ణయాలు తీసుకొని ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే ట్విట్టర్ ద్వారా ఎలాంటి అభ్యర్థనలు వచ్చినా స్పందిస్తున్నారు.

సమస్య గురించి ఎవరైనా ఫొటో తీసి పోస్టు చేస్తే.. దానిని 24 గంటల్లో పరిష్కరిస్తున్నారు. ఇటీవల అతడు బస్సులపై అసభ్యకరమైన పోస్టులు అంటించవద్దని వచ్చిన రిక్వెస్ట్ కు స్పందించి వెంటనే ఆ పోస్టర్లను తొలగించారు. అంతే కాకుండా ఇటీవల ఆర్టీసీ ఉద్యోగుల జీతాల విషయంలో ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలుసుకొని వారికి నెలలో మొదటి తారీఖునే జీతాలు పడే విధంగా చర్యలు తీసుకున్నారు.

ఇక తాజాగా జరిగిన ఘటనలో ఓ వ్యక్తి టికెట్ తీసుకున్నాడు. సీతాఫల్‌ మండీకి చెందిన లిక్కిరాజు బాలానగర్‌ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లేందుకు జీడిమెట్ల డిపో బస్సులో ఎక్కి రూ.100 నోటు ఇచ్చాడు. దానికి చిల్లర లేకపోవడంతో ఆ కండక్టర్ టికెట్ వెనకాల రూ.80 రాసి ఇచ్చాడు. వాటని దిగే ముందు తీసుకోవాలని విన్నవించాడు. కానీ ఆ ప్రయాణికుడు ఆ బస్సు కండక్టర్ ను అడగడం మర్చిపోయాడు.

అయితే ఆ విద్యార్థి ఈ సమస్య గురించి ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ కు ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. స్పందించిన ఎండీ జీడిమెట్ల డిపో మేనేజర్‌ మురళీధర్‌ రెడ్డిని పరిశీలించాలని ఆదేశించారు. అతడు దానిని పరిశీలించి నిజమని నిర్ధారించుకొని అతడి ఫోన్ పేకు రూ.80 చెల్లించాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్లు ఎండీ సజ్జనార్ ను , డిపో మేనేజర్ ను ప్రశంసించారు.

పునీత్ చేసిన గొప్పపని తలచుకుంటూ అతనికి నివాళి అర్పించిన టిఎస్ ర్టీసి మేనేజింగ్ డైరెక్టర్.. సజ్జనార్!

కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్ కుమార్ మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.ఆయన మరణవార్త తెలియగానే ఎంతో మంది సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన భౌతిక కాయాన్ని పలువురు సినీ ప్రముఖులు సందర్శిస్తూ ఎంతో భావోద్వేగంతో అవుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా పునీత్ మరణంపై టిఎస్ఆర్టిసి మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ స్పందిస్తూ ఆయన మృతికి నివాళులర్పించారు.

పునీత్ ఒక హీరోగా మాత్రమే కాకుండా సొంత ఖర్చులతో ఎన్నో అనాధాశ్రమాలు విద్యాలయాలను స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే గతంలో పునీత్ చేసిన ఒక గొప్ప పనిని తలచుకుంటూ సజ్జనార్ నివాళులర్పించారు. ఈయన గతంలో బెంగళూరు మెట్రో పాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ ) కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు.

ఈ క్రమంలోనే ఆయన ప్రజలందరూ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఉపయోగించి ఎంతో సురక్షితమైన ప్రయాణ సౌకర్యాన్ని పొందాలని మాట్లాడుతూ బస్ లేన్ ప్రియారిటి గురించి ప్రజలలో అవగాహన కల్పించారు.బస్ ప్రయారిటీ లేన్ లో బీఎంటీసీ బస్సులు, అంబులెన్స్ లు, ఫైర్ ఇంజన్లు లాంటి అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని ఆయన ప్రజలకు అవగాహన కల్పిస్తూ చేసిన ఒక మంచి పనిని సజ్జనార్ గుర్తుచేసుకుంటూ తెలంగాణ ఆర్టీసీ తరఫున ఆయన ప్రెస్ నోట్ విడుదల చేస్తూ అతని మృతికి సంతాపం తెలియజేశారు.

ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని చూడటం కోసం ఎంతో మంది అభిమానులు ప్రముఖ సినీ సెలబ్రిటీలు తరలివస్తు ఆయన భౌతిక కాయాన్ని చూసి కంటతడి పెట్టుకున్నారు. అయితే ఈయన పెద్ద కుమార్తె జర్మనీలో ఉండటంవల్ల ఆమె వచ్చిన తర్వాత అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

సాధారణ ప్రయాణికుడిగా మారిన వీసీ సజ్జనార్.. ఎందుకంటే..

తెలుగు రాష్ట్రాల్లో ఐపీఎస్ వీసీ సజ్జనార్ అంటే తెలియని వారుండరు.. క్రైంకు సంబంధించిన కేసులను డీల్ చేయడంతో ఆయనకు ఆయనే సాటి. ఐపీఎస్ అధికారిగా ఆయన తీసుకున్న నిర్ణయాలతో దేశంలోనే ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఐపీఎస్ అధికారిగా తన మార్క్ తో గుర్తింపు తెచ్చుకున్న సజ్జనార్.. టీఎస్ఆర్టీసీ ఎండీగా ప్రస్తుతం కొనసాగుతున్నాడు.

ఇదిలా ఉండగా అతడు సాధారణ ప్రయాణికుడు ఎలా బస్సులో ప్రయాణం చేస్తారో.. అలానే అతడు కూడా సాధారణ వ్యక్తిగా ప్రయాణించారు. బస్సు కండెక్టర్‌కు, ఇతర ప్రయాణికులు తానెవరో చెప్పకుండా ప్రయాణం చేశారు. అంతేకాకుండా తోటి ప్రయాణికులతో వారి బాధలను అడిగి తెలుసుకున్నారు. అతడు లక్డీకాపూల్ వద్ద గండి మైసమ్మ వైపు వెళ్లే బస్సు ఎక్కాడు.

కండెక్టర్ కు తనెవరో చెప్పకుండా.. టికెట్ తీసుకొని మరీ ఇలా ప్రయాణించాడు. అంతేకాకుండా అక్కడ నుంచి మళ్లీ ఎంజీబీఎస్ వెళ్లి అక్కడ సాధారణ వ్యక్తిలా కలియతిరుగుతూ.. పరిశుభ్రతను పరిశీలించారు. బస్టాండులోని మరుగుదొడ్ల పరిశుభ్రతను కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అంతేకాకుండా ప్లాట్‌ఫాంపై నిలబడి ఉన్న సిబ్బందితో కూడా మాట్లాడి ఆదాయ వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఖాళీగా ఉన్న స్టాల్స్‌ను వెంటనే భర్తీకి చర్యలు చేపట్టి అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా రాబోయే దసరాకు అదనపు బస్సులు నడుపుతూ.. ఆదాయాన్న పెంచుకోవాలంటూ సూచించారు. ఒక ఐపీఎస్ అధికారి ఇలా సాధారణ ప్రయాణికుడిగా.. తిరుగుతూ.. తన విధిలో భాగంగా వివరాలను తెలుసుకున్న అతడి సింప్లిసిటీని ప్రతీ ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.