కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్ కుమార్ మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.ఆయన మరణవార్త తెలియగానే ఎంతో మంది సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన భౌతిక కాయాన్ని పలువురు సినీ ప్రముఖులు సందర్శిస్తూ ఎంతో భావోద్వేగంతో అవుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా పునీత్ మరణంపై టిఎస్ఆర్టిసి మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ స్పందిస్తూ ఆయన మృతికి నివాళులర్పించారు.
పునీత్ ఒక హీరోగా మాత్రమే కాకుండా సొంత ఖర్చులతో ఎన్నో అనాధాశ్రమాలు విద్యాలయాలను స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే గతంలో పునీత్ చేసిన ఒక గొప్ప పనిని తలచుకుంటూ సజ్జనార్ నివాళులర్పించారు. ఈయన గతంలో బెంగళూరు మెట్రో పాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ ) కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు.
ఈ క్రమంలోనే ఆయన ప్రజలందరూ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఉపయోగించి ఎంతో సురక్షితమైన ప్రయాణ సౌకర్యాన్ని పొందాలని మాట్లాడుతూ బస్ లేన్ ప్రియారిటి గురించి ప్రజలలో అవగాహన కల్పించారు.బస్ ప్రయారిటీ లేన్ లో బీఎంటీసీ బస్సులు, అంబులెన్స్ లు, ఫైర్ ఇంజన్లు లాంటి అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని ఆయన ప్రజలకు అవగాహన కల్పిస్తూ చేసిన ఒక మంచి పనిని సజ్జనార్ గుర్తుచేసుకుంటూ తెలంగాణ ఆర్టీసీ తరఫున ఆయన ప్రెస్ నోట్ విడుదల చేస్తూ అతని మృతికి సంతాపం తెలియజేశారు.
ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని చూడటం కోసం ఎంతో మంది అభిమానులు ప్రముఖ సినీ సెలబ్రిటీలు తరలివస్తు ఆయన భౌతిక కాయాన్ని చూసి కంటతడి పెట్టుకున్నారు. అయితే ఈయన పెద్ద కుమార్తె జర్మనీలో ఉండటంవల్ల ఆమె వచ్చిన తర్వాత అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…