Categories: FeaturedMovie News

ఎట్టకేలకు జైలు నుంచి విడుదలైన ఆర్యన్ ఖాన్.. జైలు వద్దకు భారీగా చేరుకున్న అభిమానులు..!

అక్టోబర్ 3వ తేదీ ముంబై నుంచి గోవా వెళ్తున్నటువంటి క్రూజర్ షిప్ రేవ్ పార్టీలో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకున్నట్లు భావించి అధికారులు తనని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే నాలుగు వారాల నుంచి అధికారుల కస్టడీలో ఉన్నటువంటి ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం షారుక్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే అతని బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది.

దీంతో దేశంలోనే పేరు మోసిన లాయర్ ను రంగంలోకి దింపి ముంబై హైకోర్టు బెయిల్ పిటిషన్ ను దాఖలు చేశాడు.దీంతో గురువారం విచారణలో భాగంగా వాదోపవాదనలు విన్న అనంతరం ముంబై హైకోర్ట్ ఆర్యన్ ఖాన్ కి బెయిల్ మంజూరు చేసింది.

అయితే ఆర్యన్ ఖాన్ శుక్రవారం విడుదల కావాల్సి ఉండగా బెయిల్ పేపర్స్ కి సంబంధించిన ఫార్మాలిటీస్ శుక్రవారం గడువు ముగిసేలోగా పూర్తి కానందున శనివారం విడుదల అయ్యారు. ఆర్యన్ విడుదల కావడంతో ఆర్థర్ జైలు వద్దకు షారుక్ ఖాన్ ఆయన అభిమానులు పెద్ద ఎత్తున చేరుకొని వెల్కమ్ హోమ్ ఆర్యన్ అనే ప్ల కార్డులను పట్టుకున్నారు.

ఈ క్రమంలోని ఆర్యన్ విడుదల కావడంతో జైలు పరిసర ప్రాంతాలలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. గురువారం జరిగిన విచారణలో భాగంగా బెయిల్ ప్రక్రియను పూర్తి చేయడానికి బాలీవుడ్ నటి జూహీ చావ్లా కీలక పాత్ర పోషించారు ఆర్యన్ పూచికత్తు బాధ్యతలను తనపై వేసుకుని లక్ష రూపాయల బాండ్ పై సంతకం పెట్టారు. ఇక నేడు ఉదయం ఆర్యన్ బెయిల్ ప్రక్రియ పూర్తి కావడంతో అతను జైలు నుంచి విడుదలయ్యారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

24 hours ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

1 day ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

1 day ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

1 day ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

1 day ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

1 day ago