ఇటీవల ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన వీసీ సజ్జనార్ వివిధ రకాల సంచలనాత్మక నిర్ణయాలు తీసుకొని ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే ట్విట్టర్ ద్వారా ఎలాంటి అభ్యర్థనలు వచ్చినా స్పందిస్తున్నారు.
సమస్య గురించి ఎవరైనా ఫొటో తీసి పోస్టు చేస్తే.. దానిని 24 గంటల్లో పరిష్కరిస్తున్నారు. ఇటీవల అతడు బస్సులపై అసభ్యకరమైన పోస్టులు అంటించవద్దని వచ్చిన రిక్వెస్ట్ కు స్పందించి వెంటనే ఆ పోస్టర్లను తొలగించారు. అంతే కాకుండా ఇటీవల ఆర్టీసీ ఉద్యోగుల జీతాల విషయంలో ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలుసుకొని వారికి నెలలో మొదటి తారీఖునే జీతాలు పడే విధంగా చర్యలు తీసుకున్నారు.
ఇక తాజాగా జరిగిన ఘటనలో ఓ వ్యక్తి టికెట్ తీసుకున్నాడు. సీతాఫల్ మండీకి చెందిన లిక్కిరాజు బాలానగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లేందుకు జీడిమెట్ల డిపో బస్సులో ఎక్కి రూ.100 నోటు ఇచ్చాడు. దానికి చిల్లర లేకపోవడంతో ఆ కండక్టర్ టికెట్ వెనకాల రూ.80 రాసి ఇచ్చాడు. వాటని దిగే ముందు తీసుకోవాలని విన్నవించాడు. కానీ ఆ ప్రయాణికుడు ఆ బస్సు కండక్టర్ ను అడగడం మర్చిపోయాడు.
అయితే ఆ విద్యార్థి ఈ సమస్య గురించి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. స్పందించిన ఎండీ జీడిమెట్ల డిపో మేనేజర్ మురళీధర్ రెడ్డిని పరిశీలించాలని ఆదేశించారు. అతడు దానిని పరిశీలించి నిజమని నిర్ధారించుకొని అతడి ఫోన్ పేకు రూ.80 చెల్లించాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్లు ఎండీ సజ్జనార్ ను , డిపో మేనేజర్ ను ప్రశంసించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…