Tag Archives: workouts

అతడికి 72 ఏళ్లు.. కానీ 30 ఏళ్ల వయస్సు వ్యక్తిగా కనిపిస్తున్నాడు కదా.. రహస్యం ఇదే..!

ఫిట్ బాడీని మెయింటెయిన్ చేయడం, ఆరోగ్యంగా ఉండడం అనేది ఈ రోజుల్లో ప్రజలు చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. అయితే అనుకున్నంత సులువగా సాధనలో మాత్రం పెట్టలేకపోతున్నారు.అయితే చైనాకు చెందిన ఓ వ్యక్తి తన ఫిట్‌నెస్ విధానంలో చాలా ప్రయోజనాలను పొందాడు .ఈ వ్యక్తి పేరు జిన్మిన్ యాంగ్. అతడికి 72 ఏళ్లు.

చైనాకు చెందిన వ్యక్తి. కానీ ఇతడిని చూస్తే.. 72 ఏళ్ల వయస్సు వ్యక్తి కాకుండా 30 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తిగా కనిపిస్తున్నాడు. దానికి గల కారణం ఏంటంటే.. తన యవ్వన రూపాన్ని తిరిగి తెచ్చుకోవడంలో ఉపయోగపడింది కేవలం అతడు చేసే ఫిట్ నెస్ మాత్రమే. అవును మీరు విన్నది నిజమే.

ఫిట్‌నెస్ పట్ల అతనికి ఉన్న ఆసక్తి.. అతడు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి సహాయపడిందని అతడే స్వయంగా చెప్పాడు. ప్రతీ రోజు ఫుల్ గా వ్యాయామం చేసేవాడినని చెప్పాడు. సమయం దొరికితే ఎక్కువగా జిమ్ లోనే గడుపుతానన్నాడు. అతడికి ఈ ఫీట్ కూడా అంత తేలికగా రాలేదని.. దీని వెనుకాల ఎంతో శ్రమించినట్లు పేర్కొన్నాడు.

ఈ విషయాలను అతడు 2018లో చైనీస్ మీడియా కంపెనీ చేంజ్ ప్రొడక్షన్‌తో మాట్లాడాడు. రోజులో దాదాపు 24 గంటల సమయం ఉంటే.. అతడు దాదాపు 3 నుంచి 4 గంటల వరకు బాడీ బిల్డింగ్ పైనే ఎక్కువగా శ్రద్ధ చూపించేవాడట. ఇందంతా బాడీ బిల్డింగ్ శిక్షణలో పాల్గొన్నందుకే జరిగిందన్నాడు. ఇలా చేస్తే అనారోగ్యాలు కూడా దరి చేరవు అని సూచించాడు. అయితే ప్రస్తుతం అతడు అన్న మాటలు.. అతడి వయస్సుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తారక్ చేతికి సర్జరీ..జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ గాయపడిన తారక్!


యంగ్ టైగర్ ఎన్టీఆర్ దీపావళి పండుగను పురస్కరించుకుని తన కుటుంబంతో కలిసి ఎంతో సంతోషంగా దీపావళి పండుగను జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన కొడుకులతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలలో తారక్ చేతికి బ్యాండేజ్ చుట్టి ఉండడంతో అభిమానులు తారక్ చేతికి ఏమైంది అంటూ ఆందోళన పడ్డారు.

అయితే తారక్ చేతికి ఏమైందనే విషయానికి వస్తే తాజాగా తారక్ జిమ్ లో వర్కవుట్ చేస్తుండగా చిన్న ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతని కుడి చేతి వేలుకు గాయం కావడం చేత వైద్యులు చిన్న సర్జరీ నిర్వహించినట్లు వెల్లడించారు.ఈ క్రమంలోనే వైద్యుల సలహా మేరకు తారక్ పూర్తిగా ఇంటికి పరిమితమై రెస్ట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఏది ఏమైనా తెలుగు హీరోలు ఇలా వరుసగా ప్రమాదాల బారిన పడుతూ సర్జరీలు చేయించుకోవడం పట్ల అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం మెగాస్టార్ చిరు తన కుడిచేతి మణికట్టుకు సర్జరీ చేయించుకోగా, బాలకృష్ణ కుడి భుజానికి సర్జరీ చేయించుకున్నారు. ఈ క్రమంలోనే తారక్ కుడి చేతికి సర్జరీ కావడంతో అభిమానులు ఆందోళన చెందాల్సిన పని లేదని సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే తారక్ నటించిన RRR విడుదలకు సిద్ధంగా ఉంది. జనవరి 7వ తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే తారక్ కొరటాల కాంబినేషన్ లో వస్తున్నటువంటి మరొక సినిమా నెల రోజులలో షూటింగ్ పనులను ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది

పునీత్ కి గుండెపోటు రావడానికి కారణం అదేనా..?

పునీత్ రాజ్ కుమార్ మరణం కన్నడ సినీ పరిశ్రమలోనే కాకుండా అన్ని సినీపరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇతని మరణవార్తతో అభిమానులు,కుటుంబ సభ్యులు,బంధువులు,సన్నిహితులు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. ఇప్పటికీ కొంతమంది ఆ మరణవార్త విని షాక్ లోనే ఉన్నారు. నిన్న అనగా శుక్రవారం ఉదయం జిమ్ చేస్తుండగా హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో మరణించారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో అతడి మరణం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.పునీత్ లు ఎంతో ఇష్టమైన ఆయన హెవీ వర్కౌట్స్ అతని మరణానికి కారణమా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఎప్పటిలాగే జిమ్ లో భారీ వర్కౌట్ చేస్తూ ఉండే పునీత్ నిన్న జిమ్లో వర్కవుట్ చేస్తూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

అయితే డాక్టర్లు అతడి గుండెలోని రక్తనాళాలు చిట్లిపోవడం వల్లే మృతి చెందినట్లు తెలిపారు. జిమ్ సమయంలో కార్డియాక్ అరెస్ట్ జరిగి ప్రాణాలు కోల్పోయినట్టు వివరించారు.పునీత్ చేసే వర్కౌట్స్ చాలా ప్రమాదకరంగా ఉండేవని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే గుండె పోటుకు గురవడం పునీత్ కుటుంబానికి ఇది కొత్త ఏమీ కాదు.

గతంలో పునీత్ అన్న శివరాజ్ కుమార్ కూడా జిమ్లో వర్కవుట్ చేస్తూ గుండెపోటుకు గురయ్యారు. అదృష్టవశాత్తు మృత్యువు నుంచి బయటపడ్డారు. కానీ పునీత్ మాత్రం మృత్యువు ఒడిలోకి జారుకున్నారు. ఆ తర్వాతి సినిమా లో బాడీ బిల్డర్ పాత్ర కోసం ఆయన పడిన కష్టం ఏకంగా ఆయన ప్రాణాల మీదకు తెచ్చింది. మొత్తానికి పునీత్ రాజ్ కుమార్ మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు అని చెప్పవచ్చు.