Categories: FeaturedMovie News

పునీత్ కి గుండెపోటు రావడానికి కారణం అదేనా..?

పునీత్ రాజ్ కుమార్ మరణం కన్నడ సినీ పరిశ్రమలోనే కాకుండా అన్ని సినీపరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇతని మరణవార్తతో అభిమానులు,కుటుంబ సభ్యులు,బంధువులు,సన్నిహితులు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. ఇప్పటికీ కొంతమంది ఆ మరణవార్త విని షాక్ లోనే ఉన్నారు. నిన్న అనగా శుక్రవారం ఉదయం జిమ్ చేస్తుండగా హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో మరణించారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో అతడి మరణం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.పునీత్ లు ఎంతో ఇష్టమైన ఆయన హెవీ వర్కౌట్స్ అతని మరణానికి కారణమా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఎప్పటిలాగే జిమ్ లో భారీ వర్కౌట్ చేస్తూ ఉండే పునీత్ నిన్న జిమ్లో వర్కవుట్ చేస్తూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

అయితే డాక్టర్లు అతడి గుండెలోని రక్తనాళాలు చిట్లిపోవడం వల్లే మృతి చెందినట్లు తెలిపారు. జిమ్ సమయంలో కార్డియాక్ అరెస్ట్ జరిగి ప్రాణాలు కోల్పోయినట్టు వివరించారు.పునీత్ చేసే వర్కౌట్స్ చాలా ప్రమాదకరంగా ఉండేవని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే గుండె పోటుకు గురవడం పునీత్ కుటుంబానికి ఇది కొత్త ఏమీ కాదు.

గతంలో పునీత్ అన్న శివరాజ్ కుమార్ కూడా జిమ్లో వర్కవుట్ చేస్తూ గుండెపోటుకు గురయ్యారు. అదృష్టవశాత్తు మృత్యువు నుంచి బయటపడ్డారు. కానీ పునీత్ మాత్రం మృత్యువు ఒడిలోకి జారుకున్నారు. ఆ తర్వాతి సినిమా లో బాడీ బిల్డర్ పాత్ర కోసం ఆయన పడిన కష్టం ఏకంగా ఆయన ప్రాణాల మీదకు తెచ్చింది. మొత్తానికి పునీత్ రాజ్ కుమార్ మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు అని చెప్పవచ్చు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago