Movie News

షన్ను.. జెస్సీలను ఒక ఆటాడుకున్న సన్నీ.. చివరికి జైలు పాలయ్యాడు..!

తాజాగా బిగ్ బాస్ ఎపిసోడ్ హీట్ ఎక్కింది. మానస్, సన్నీ, జెస్సీ లో రెచ్చిపోయారు. జెస్సీ రెచ్చిపోయి సన్నీకి దీటుగా నిలిచాడు. కెప్టెన్సీ టాస్క్ లో సంచాలకుడిగా తన నిర్ణయం సరైనది అంటూ బల్లగుద్ది చెప్పాడు. తాజాగా జరిగిన ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ గురించి చర్చ జరిగింది. ఇందులో షణ్ముఖ్ జస్వంత్ విజయం సాధించి,నెక్స్ట్ వీక్ కీ కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఇక జెస్సీ సంచాలకుడిగా ఈ ఫైనల్ టాక్స్ జరిగింది. ఈ నేపథ్యంలోనే జెస్సి తీసుకున్న నిర్ణయం సరైనది కాదు అని మానస్, సన్నీ లు వాదిస్తున్నారు.

అసలు ఆట ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అని మానస్ తో సన్నీ చెప్పాడు. ఈ క్రమంలోనే మానస్ మరొకసారి బిగ్ బాస్ రూల్స్ ని తిరిగి చదివి వినిపించాడు. సంచాలకుడు రూల్స్ ఫాలో కాలేదని తెలిపారు.షణ్ముఖ్ జస్వంత్, సిరి కి పేవర్ గా వ్యవహరించాలి అని వారు ఆరోపించారు. ఈ విషయంలో విశ్వ తాను మాట్లాడింది తప్పు అయితే సారీ అంటూ వెళ్లిపోయాడు. ఆ తరువాత సన్నీ, మానస్ లు కూర్చుని మాట్లాడుకున్నారు.

బిగ్ బాస్ కంటెస్టెంట్ లకు వరెస్ట్ ఫర్ పెర్మర్ అనే టాస్క్ ను ఇచ్చాడు. ఈ టాస్క్ హౌస్ ని మరింత హీటెక్కించిందీ.ఈ టాస్క్ లో సన్నీకి, కాజల్‌కి మూడు ఓట్లు వచ్చాయి. కెప్టెన్‌గా షణ్ముఖ్‌ సన్నీని వరస్ట్ పర్ ఫర్మెర్‌గా నిర్ణయించారు. అప్పుడు సన్నీ తనని ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించాడు. నిన్నటి టాస్క్ విషయంలో సన్నీ చేసింది కరెక్ట్ కాదని, ఆయన ఫిజికల్‌గా వెళ్లాడని, అది తనకు నచ్చలేదని చెప్పాడు షన్ను.

తాను ఫిజికల్‌ చేయలేదని, మూమెంట్‌ ఇచ్చానని వారించాడు సన్నీ. ఈ గొడవ తారా స్థాయికి చేరుకుంది. సంచాలకుడు సరిగ్గా వ్యవహరించలేదని ఆరోపించాడు సన్నీ. ఓడిపోయారని జెస్సీ అంటే ఓడించారని సన్నీ అంటాడు. ఇలా జెస్సీ, సిరి,సన్నీ,మానస్‌ల మధ్య గొడవ పీక్‌లోకి వెళ్లింది.మొత్తంగా సన్నీ ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. జెస్సీకి, కెప్టెన్‌ షణ్ముఖ్‌కి చుక్కలు చూపించాడు. అయితే జెస్సీ కూడా రెచ్చిపోవడం ఈ రోజు ఎపిసోడ్‌ మరో హైలైట్‌గా నిలిచిందని చెప్పొచ్చు. అయితే ఫైనల్‌గా వరస్ట్ పర్‌ఫెర్మర్‌గా సన్నీని నిర్ణయించి ఆయన్ని జైలుకి పాలయ్యారు. ఎంతగానో వాదించిన సన్నీ జైలుపాలయ్యారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

20 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

21 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

1 day ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

1 day ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

1 day ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago