పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం యావత్ సినీ లోకాన్ని విషాదంలో ముంచేసింది. కన్నడ ప్రేక్షకులు ఎంతగానో అభిమానించే తమ హీరో అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందాడు అన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ మరణవార్త విని అటు అతని కుటుంబంలో, ఇటు కన్నడ ఇండస్ట్రీ లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇతని మరణ వార్త విన్న పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా మృతికి సంతాపం తెలుపుతున్నారు.
పునీత్ ఆత్మకు శాంతి చేకూరాలని అంటూ సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. పునీత్ మరణం పై ఇప్పటికే పలువురు ప్రముఖులు స్పందించారు.పునీత్ ని అతడి అభిమానులు ముద్దుగా అప్పు అని పిలుచుకుంటారు.పునీత్ చనిపోవడానికి రెండు రోజుల ముందు తన అన్న శివరాజ్ కుమార్ నటించిన భజరంగి 2 ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేశారు.
ఈ నేపథ్యంలోనే కన్నడ స్టార్ హీరో యష్ తో కలసి స్టేజిపై స్టెప్పులు కూడా వేశారు. ఇక పునీత్ మరణంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ సంతాపం వ్యక్తం చేశారు. విధి చాలా క్రూరమైనది. మంచి వ్యక్తి ప్రతిభావంతుడైన నటుడు పునీత్ రాజ్ కుమార్ ను మనకు దూరం చేసింది. పునీత్ ది చనిపోవలసింది వయసు కాదు. అతడు రాబోయే తరాలకు ఆదర్శంగా ఉంటారని,అతని అద్భుతమైన వ్యక్తిత్వం ను రాబోయే తరాలు గుర్తుంచుకుంటాయని అన్నారు మోడీ.
ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలిపారు. ఓం శాంతి అంటూ నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.పునీత్ చనిపోయినప్పటికీ ఆయన కళ్లు ఈ ప్రపంచాన్ని చూడనున్నాయి. పునీత్ అతని కళ్ళను దానం చేయనున్నట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. గతంలో అతడి తండ్రి చనిపోయినప్పుడు కూడా ఆయన కళ్ళను ఒకరికి దానం చేశారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…