కీర్తి సురేష్ ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.మహానటి సినిమాతో కేవలం తెలుగు తెలుగు ప్రేక్షకులకే కాదు తమిళం, హిందీ ఇండస్ట్రీ లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్ ఇండస్ట్రీలో ఉంటూ అందాల ఆరబోతకు దూరంగా ఉండి స్టార్ డమ్ తెచ్చుకుంటుంది కీర్తి. వరస సినిమాలతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ అప్పుడప్పుడూ ఫోటోషూట్స్ కూడా చేస్తుంటుంది.
మలయాళం లో సూపర్ హిట్ ప్రేమమ్ సినిమాతో నీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత అ..ఆ నీ మాతో తో తెలుగు సినిమాలోకి తెరంగ్రేటం చేసింది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టింది.ఈ మలయాళీ బామకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.అతి కొద్దీ కాలంలోనే యూత్ లో భారీ క్రేజ్ ని సంపాదించుకుంది.సోషల్ మీడియా ఫేస్ బుక్ లో , ఇంస్టాగ్రామ్ లలో మిలియన్స్ కొద్దీ ఫాలోవర్స్ ని సంపాదించుకుంది బ్యూటీ.
ఇది ఇలా ఉంటే కీర్తి సురేష్ ఒకవైపు తమిళ సూపర్ స్టార్ హీరో రజనీకాంత్ తో.. మరొకవైపు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తో ఛాన్సులు కొట్టేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఒకేసారి ఇద్దరు లెజెండ్స్ తో స్క్రీన్ చేసుకునే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. అంతేకాకుండా ఈ బ్యూటీ ఇద్దరు బిగ్ స్టార్స్ కు చెల్లెలి పాత్రలో నటించడం మరొక ఇంట్రెస్టింగ్ విషయం. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న అన్నాత్తే ఈ సినిమాలో రజనీకాంత్ కి చెల్లెలు గా నటిస్తోంది.
చిరంజీవి హీరోగా నటిస్తున్న బోళా శంకర్ సినిమాలో చిరుకి చెల్లెలి పాత్రలో నటిస్తోంది. సురేష్ చెల్లెలు క్యారెక్టర్ కే పరిమితం అయ్యింది. దీంతో ఆమె అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకూ మంచి మంచి పాత్రలో డిఫరెంట్ రోల్స్ చేస్తూ వెళ్ళిన కీర్తి సురేష్ ఒకే టైపు రోల్స్ చేయడాన్ని వారు అంతగా జీర్ణించుకోలేకపోతున్నారు.ఈ విషయంపై కొందరు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కీర్తి చెల్లెకు కేరాఫ్ గా మారి పోతున్నావ్ ఏంటి? అంటూ నేమ్స్ అండ్ కామెంట్స్ ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…