యంగ్ టైగర్ ఎన్టీఆర్ దీపావళి పండుగను పురస్కరించుకుని తన కుటుంబంతో కలిసి ఎంతో సంతోషంగా దీపావళి పండుగను జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన కొడుకులతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలలో తారక్ చేతికి బ్యాండేజ్ చుట్టి ఉండడంతో అభిమానులు తారక్ చేతికి ఏమైంది అంటూ ఆందోళన పడ్డారు.
అయితే తారక్ చేతికి ఏమైందనే విషయానికి వస్తే తాజాగా తారక్ జిమ్ లో వర్కవుట్ చేస్తుండగా చిన్న ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతని కుడి చేతి వేలుకు గాయం కావడం చేత వైద్యులు చిన్న సర్జరీ నిర్వహించినట్లు వెల్లడించారు.ఈ క్రమంలోనే వైద్యుల సలహా మేరకు తారక్ పూర్తిగా ఇంటికి పరిమితమై రెస్ట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఏది ఏమైనా తెలుగు హీరోలు ఇలా వరుసగా ప్రమాదాల బారిన పడుతూ సర్జరీలు చేయించుకోవడం పట్ల అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం మెగాస్టార్ చిరు తన కుడిచేతి మణికట్టుకు సర్జరీ చేయించుకోగా, బాలకృష్ణ కుడి భుజానికి సర్జరీ చేయించుకున్నారు. ఈ క్రమంలోనే తారక్ కుడి చేతికి సర్జరీ కావడంతో అభిమానులు ఆందోళన చెందాల్సిన పని లేదని సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే తారక్ నటించిన RRR విడుదలకు సిద్ధంగా ఉంది. జనవరి 7వ తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే తారక్ కొరటాల కాంబినేషన్ లో వస్తున్నటువంటి మరొక సినిమా నెల రోజులలో షూటింగ్ పనులను ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…