పెద్ద ప్రాజెక్టులకు సంబంధించి తనదాకా వచ్చి పోయిన సినిమాలు కూడా ఉన్నాయని సినీ రచయిత వెలిగొండ శ్రీనివాస్ అన్నారు. అందులో ముఖ్యంగా ప్రముఖ నటుడు మహేశ్ బాబుతో ఒక ఏలియంట్ ప్రాజెక్టు చేద్దామని అనుకున్నట్టు ఆయన తెలిపారు. అది 100 కోట్ల బడ్జెట్‌తో చేసేందుకు ప్లాన్ వేశానని శ్రీనివాస్ చెప్పారు.
అది ఎప్పుడు అంటే అఖిల్‌తో సినిమా హిట్ అయితే .. అని ఆయన స్పష్టం చేశారు. అలా ఆలోచన వచ్చినపుడు అది 100 కోట్ల బడ్జెట్ అయితే, అదే సినిమా ఇప్పుడు తీయాలంటే దాదాపు 200 కోట్లు అవుతుందని ఆయన అన్నారు. అంతేగాకుండా ఆ ప్రాజెక్టులోని ఓ లైన్‌ను కూడా కోడి రామకృష్ణకు చెబితే, ఆయన చాలా బాగుందని మెచ్చుకున్నట్టు ఆయన తెలిపారు.
అయితే అంతకుముందున్న చేసే ప్రాజెక్టు హిట్ అయితే ధైర్యంగా ఉంటుంది. ఏదైనా ఇలాంటి ప్రయోగాలు ఇలా చేయడానికి ఉంటుందని అలా రెడీ చేసి పెట్టానని ఆయన చెప్పుకొచ్చారు. అది నిజానికి మహేశ్ బాబు గారికి చెప్పలేదు. కానీ ఆ తర్వాత ఆగిపోయానని ఆయన స్పష్టం చేశారు. ఈ హై బడ్జెట్లు వద్దు. మన నెత్తి మీద భారం పెట్టుకోవడం వద్దు. మనం మోయలేమని బాత్ నుంచి తానే నిర్ణయం మార్చుకున్నట్లు ఆయన వివరించారు. ఇలాంటి చిన్న కథలే చేద్దాం. ఈ తలనొప్పులు ఎందుకు అని నిర్ణయించుకున్నట్టు ఆయన తెలిపారు.
నిజం చెప్పాలంటే తాను అలాంటి హై బడ్జెట్ తీయడానికి ధైర్యం చేయలేకపోయానని శ్రీనివాస్ తెలిపారు. ఒకవేళ సక్సెస్ వచ్చి ఉంటే రకరకాలుగా ఆలోచించి ఎలాగైనా అలాంటి పెద్ద హీరోలతో అంతటి స్థాయిలో సినిమా తీసేవాడినని ఆయన ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…