ప్రముఖ నటి ప్రియమణిని బలవంతపెట్టి మరీ ఓ సినిమాలో స్విమ్ సూట్ వేయించాము. అదంతా ఓ పెద్ద కథ అని సినీ నిర్మాత డి.ఎస్.రావు తెలిపారు. ఓ రోజు డైరెక్టర్ ఆమెను పిలిచి, నువ్వు ఒప్పుకుంటే ఇలా స్విమ్ సూట్ వేయిస్తాము. ఒక సోలో సాంగ్ ఉంది. బాగా వస్తుంది అని చెప్పినట్టు ఆయన అన్నారు.
అప్పుడు ప్రియమణి ఒక 5నిమిషాలు టైం ఇవ్వండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది. క్యారవాన్ లో ఎక్కి వాళ్ల అమ్మగారితో ఏదో మాట్లాడి అక్కడి నుంచి మళ్లీ వచ్చి, ఓకే అనిందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సంఘటన తర్వాత చాలా మంది డీఎస్ రావు దగ్గర డబ్బు గుంజిన ప్రియమణి అని, ఇంకా ఏవో కామెంట్లతో తప్పుడు ప్రచారం చేశారని ఆయన చెప్పారు.
ఆ తర్వాత అవన్నీ చూడలేక తానే ఓ ప్రెస్‌మీట్ పెట్టి క్లియర్‌గా చెప్పానని, ఆ అమ్మాయి అసలు మనీ గురించి ఏం మాట్లాడలేదు. ఆమెకు ఇంట్రస్ట్ ఉంది చేస్తానంది, చేసింది మేం చేపించాం అని ఆయన స్పష్టం చేశారు. నిజంగా ఆ విషయంలో తన ఇన్వాల్మెంట్ ఏమీ లేదని ఆయన కరాఖండిగా చెప్పారు.
అదంతా అయిపోయాక కేవలం ఫొటోస్ అన్నీ తీసి దగ్గర పెట్టుకొని, రిలీజ్ అప్పుడు ప్లే చేశానని, ముందే చెప్తే అల్లరి చేస్తారని డీఎస్ రావు వివరించారు. కనీసం ఆ అమ్మాయికి కూడా ఆ ఫొటోస్ ఇవ్వలేదని ఆయన చెప్పారు. లేదంటే ఆ ఫొటో వద్దు, ఈ ఫొటో వద్దు అని ఏదో చెప్తారని అలా చేయలేదని ఆయన తెలిపారు. అదొక్కటే తాను బిజినెస్ యాంగిల్‌లో చేయలేదని ఆయన స్పష్టం చేశారు. అప్పట్లో ఆ సినిమాకు మంచి ఓపెనింగ్ వచ్చిందని ఆయన అన్నారు
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…