సినీ ఇండస్ట్రీలో ఓ ప్రముఖ దర్శకుడి గురించి సినీ నటుడు వంశీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. హ్యాపీడేస్ తర్వాత ఆ సినిమాలో తనతో పాటు చేసిన వారందరికీ మంచి పేరు వచ్చిందని నటుడు వంశీ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఆ డైరెక్టర్ తీసిన సినిమా మంచి హిట్ కొట్టడం, అదీ గాక తనకు ఆ మూవీ నచ్చడంతో ఆయన్ని కలిసి విష్ చేద్దామని అనుకున్నట్టు ఆయన తెలిపారు.
ఆ తర్వాత నెంబర్ తీసుకొని ఆయనకు కాల్ చేసి, ఫిల్మ్ నగర్‌లో ఒకసారి కలిశానని వంశీ అన్నారు. బొకే ఇచ్చి, మంచి సినిమా తీశారని ఆయనతో మాట్లాడినట్టు వంశీ తెలిపారు. అప్పుడు ఆయన మీ గురించి ఆలోచిస్తున్నాను. ఈలోగా మీరే నాకు ఫోన్ చేసి నా దగ్గరికి వచ్చారు. మనిద్దరం తప్పకుండా కలిసి పనిచేయాలి అని ఆయన తనతో అన్నట్టు వంశీ వెల్లడించారు. ఈ మాట ఆయనే స్వయంగా అన్నారన్న వంశీ, నిజంగా తనను అప్రిషియేట్ చేయడానికి మాత్రమే అక్కడికి వెళ్లానని ఆయన అన్నారు. నా నెక్స్ట్ సినిమా ఆయనతో కావాలని గానీ, స్కెచ్ వేసుకొని గానీ అక్కడికి వెళ్లలేదని ఆయన చెప్పారు. ఆ క్షణం అనిపించింది అతను నిజంగా అంటున్నాని తాను అనుకున్నట్టు వంశీ తెలిపారు.
అతను చాలా మంచి డైరెక్టర్. అతనితో ఎలాంటి విభేదాలూ లేవు. ఆయన గురించి తాను తప్పుగా కూడా ఏమీ అనట్లేదని వంశీ అన్నారు. ఇక్కడ ఎవరి జర్నీ వాళ్లు చూసుకుంటారని, అతనికి ఒక 15కోట్ల సినిమా వస్తే, ఆ తర్వాత అంత కంటే ఎక్కువ బడ్జెట్లో సినిమా తీయాలని అనుకుంటాడని వంశీ తెలిపారు. అంతే తప్ప వంశీ అప్పుడెప్పుడో పుష్ప గుచ్ఛం ఇచ్చాడు. వాడు మంచి యాక్టర్. వాడితో సినిమా తీయాలని వారు ఎందుకనుకుంటారు ఆని పరోక్ష కామెంట్లు చేశారు వంశీ. అలా జరిగిందే తప్ప ఆయన్ని తాను ఏం తప్పు పట్టడం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఇప్పటికీ కూడా ఆయనతో హాయ్, హలోలు నడుస్తూ ఉంటాయి. కానీ, తాను ఆయనకు కలిసింది ఇంకా గుర్తుందా అని తనకు ఎప్పుటినుంచో ఉన్న డౌట్ అని వంశీ అన్నారు. ఒకవేళ భవిష్యత్‌లో మళ్లీ ఆయనతో చేస్తే నేను మీకు గుర్తున్నానా అని ఆయన్ని అడగాలని ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…