పునీత్ రాజ్ కుమార్ ఒక్కసారిగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయి అటు అభిమానులకు ఇటు కుటుంబ సభ్యులకు శోకసంద్రంలోకి నెట్టేశారు. ఆయన మరణ వార్తను విని అభిమానులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇప్పటికీ పునీత్ లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ అకాలమరణం భారతసినీ పరిశ్రమకు తీరని లోటని చెప్పవచ్చు.
ఆయన పార్థివ దేహాన్ని చూడడానికి అభిమానులు సెలబ్రిటీలు భారీ ఎత్తున వచ్చారు. పునీత్ ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా ఎందరికో జీవితాన్ని ఇవ్వటమే కాకుండా ఆయన మూగజీవాల పట్ల ఎంతో ప్రేమను చూపిస్తూ వాటిని చేరదీసేవాడు. అలా అతనికి ఉన్న మంచి మనసుతో ఎన్నో కుక్కలను ఇష్టంగా పెంచుకున్నారు. వాటికి ఏమైనా అయితే అతడి మనసు తల్లడిల్లిపోయేది.
అప్పుడప్పుడు ఆ పెంపుడు కుక్కల గురించి, అలాగే వాటికి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకునేవాడు. అలా అల్లారుముద్దుగా పెంచుకున్న తన రెండు పెంపుడు కుక్కలు పునీత్ కనిపించకపోయేసరికి కన్నీటి పర్యంతం అవుతున్నాయి. పునీత్ మరణించినప్పటి నుంచి ఆ పెంపుడు కుక్కలు ఆహారం తినకుండా బాధతో ఉన్నట్లు కనిపిస్తున్నాయి.
ఆ పెంపుడు కుక్కలు పదేపదే పునీత్ ఫోటో వద్దకు వెళ్లి దీనంగా చూస్తూ ఉన్నాయి. ఆ కుక్కలు పునీత్ ఫోటో వద్దకు వెళ్లి చూస్తుండటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చివరికి అతని సమాధి వద్దకు ఆయన కుటుంబ సభ్యులు ఆ కుక్కలను తీసుకెళ్లారు. పునీత్ మరణం తర్వాత ఈ మూగజీవాలు చూపిస్తున్న ప్రేమను చూసి అతని అభిమానులు సైతం ఎమోషనల్ అవుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…