బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్య క్రమంలో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ మనకు పరిచయమయ్యారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో కమెడియన్ వేణు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన జబర్దస్త్ ద్వారా ఎంతో ప్రేక్షకాదరణ సంపాదించుకుని ఆ తర్వాత పలు సినిమాలలో తన అద్భుతమైన కామెడి ద్వారా ప్రేక్షకులను సంపాదించుకున్నారు.
అయితే కొన్ని కారణాల వల్ల జబర్దస్త్ కి దూరమైన కమెడియన్ వేణు గురించి గత కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో పెద్దఎత్తున వార్తలు వినిపించాయి. జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన తర్వాత వేణు ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని,అతడికి ఎలాంటి అవకాశాలు లేక ఇండస్ట్రీలో దీనమైన పరిస్థితులలో ఉన్నారనే వార్తలు వినిపించాయి. అయితే ఈ కష్టాలనుంచి జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుదీర్ వేణును ఆదుకున్నట్లు వార్తలు వినిపించాయి.
సుడిగాలి సుదీర్ నటుడు వేణుకు 15 లక్షలు ఇచ్చాడని ఆ 15 లక్షలతోనే వేణు కాలం గడుపుతున్నట్లు అతని గురించి వచ్చిన వార్తలపై తాజాగా నటుడు కమెడియన్ వేణు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సుడిగాలి సుదీర్ తనకు 15 లక్షలు ఇచ్చాడన్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని కొట్టిపారేశారు. ఈ వార్త విన్న తర్వాత ఒరేయ్ సుదీర్ నా 15 లక్షలు నాకు ఎప్పుడు ఇస్తావు అంటూ అతనిని అడగడంతో అన్న వాడెవడో సరదాగా రాశారు అంటూ చెప్పుకొచ్చారు.
ప్రస్తుత కాలంలో యూట్యూబ్ ఛానల్స్ అధికమవడంతో వారి చానల్స్ కు ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు రావడం కోసం వారి రాసే వార్తలకు అధిక వ్యూస్ రావడం కోసం ఇలాంటి వార్తలను సృష్టిస్తున్నారని అలా రాయడంతో వారికి కాస్త ఫుడ్ దొరుకుతుందన్న ఉద్దేశంతో ఇలాంటి వార్తలు రాస్తున్నారని తెలిపారు. ఇక ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తన అన్న ఫోన్ చేసి ఇది నిజమేనా అందుకే నువ్వు డల్ గా ఉన్నావా నిజం చెప్పు అంటూ తనని అడిగారని ఈ సందర్భంగా వేణు ఆ 15 లక్షల విషయం గురించి చెప్పుకొచ్చారు.
శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు-కేతు పూజల టికెట్ ధరల పెంపుపై చెలరేగిన వివాదానికి చివరకు ముగింపు పడింది. భక్తుల నుంచి వచ్చిన…
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్‌గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…