కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం కేవలం శాండల్ వుడ్ నే కాదు,యావత్ భారత సినీ ఇండస్ట్రీని ఒక్కసారిగా శోకసంద్రంలోకి నెట్టింది.పునీత్ మరణ వార్తతో కర్ణాటక రాష్ట్రం అంతా ఒక్కసారిగా కన్నీటి పర్వంతం అయ్యింది.పునీత్ ఇంట్లో జిమ్ చేస్తుండగా ఛాతిలో నొప్పి వచ్చిందని ఆస్పత్రిలో చేరిన పునీత్ రాజ్ కుమార్, ఆ తరువాత పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచాడు.
పునీత్ అకాల మరణంతో కుటుంబ సభ్యులతో పాటు అభిమానులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. పునీత్ రాజ్ కుమార్ మరణంతో చాలా మంది జీవితం ప్రశ్నార్ధకంగా మారింది.పునీత్ తన స్వఛ్చంద సంస్థ ద్వార ఎంతో మందికి సహాయం చేస్తున్నారు.అందులో ముఖ్యంగా అనాధాశ్రమాలు, వృధ్దాశ్రమాలు నడుపుతున్నారు. అలాగే నిరుపేద విధ్యార్ధులకు చదువు చెప్పిస్తున్నారు.
అలా తన సొంత ఖర్చులతో ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్న పునీత్ హఠాత్తుగా మరణించడంతో ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలన్నింటి పరిస్థితి ప్రశ్నర్థకంగా మారింది.ఈ 1800 మంది చదువు బాధ్యత తాను తీసుకుంటానని తమిళ హీరో విశాల్ ప్రకటించారు.
ఇకపోతే పునీత్ రాజ్ కుమార్ తాను చేస్తున్న సమాజ సేవ కోసం ముందు చూపుతో ఆలోచించారని ఆలస్యంగా తెలిసింది. ఇలా అంటే తన ఛారిటీ ద్వార అందిస్తున్న సేవా కార్యక్రమాలు ఎప్పటికీ ఆగిపోకూడదని పునీత్ ఎంతో దూరదృష్టితో ఆలోచించి తన ఛారిటీ కోసం ఏకంగా 8 కోట్ల రూపాయలను ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఈ 8 కోట్ల రూపాయలతో వచ్చే వడ్డీతో తాను నిర్వహిస్తున్న అన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించే విధంగా ఏర్పాటు చేశారు.
వాతావరణ మార్పులు మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక రోజు ఎండగా ఉండగా, మరుసటి రోజు…
40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ దశలో శరీరంలో…
మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన డీలిమిటేషన్ అంశంపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ విషయంలో ఏపీ సీఎం ఎన్.…
అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లు చేయడం శుభమనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ముఖ్యంగా బంగారం, వెండి కొనడం ఆనవాయితీగా…
పిల్లల్లో ఆటిజం (Autism) సమస్యపై అవగాహన రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, చాలా మంది తల్లిదండ్రులు ప్రారంభ లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం చేస్తున్నారు.…
తిరుమల దేవాలయం చుట్టూ ఉన్న మాడ వీధులు భక్తులకు కేవలం మార్గాలే కాదు, ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీకలుగా నిలిచాయి. కలియుగ…