టాలీవుడ్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలయ్య
హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ యన్.బి.కె టాక్ షో దీపావళి పండుగ సందర్భంగా ఆహా ఓటీటీలో ప్రారంభమయ్యింది. ఈ షోకి మొదటి రోజున గెస్ట్ లుగా నటుడు మోహన్ బాబు, మంచు లక్ష్మి, మంచు విష్ణు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
నటుడు అల్లు అరవింద్ ఆహా ఓటీటీ క్రమంగా పాపులర్ అవుతోంది. ఇందులో కేవలం సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లు, అలాగే ఒరిజినల్ సినిమాలతో ఆహా ఓటిటి అందరినీ ఆకర్షిస్తోంది. ఇక ఈ షో తొలి ఎపిసోడ్ కి మోహన్ బాబుని రంగంలోకి దించారు. బాలయ్య హోస్ట్ గా చేస్తున్న షో కి హన్ బాబు గెస్ట్ రావడంతో అన్ స్టాపబుల్ పై మరింత ఉత్కంఠ కొనసాగింది.
దీపావళి కానుకగా తొలి ఎపిసోడ్ గురువారం విడుదలయింది. మోహన్ బాబుతో పాటుగా మంచు విష్ణు, మంచు లక్ష్మి కూడా ఈ షోలో పాల్గొన్నారు.ఈ క్రమంలోనే బాలయ్య, మోహన్ బాబు మధ్య అనేక విషయాలు గురించి మాట్లాడుకున్నారు. ఈ సందర్బంగా మోహన్ బాబు మాట్లాడుతూ..తన సినీ కెరీర్ లో పడ్డ ఇబ్బందులు, స్వర్గీయ ఎన్టిఆర్ తో తన అనుబంధం గురించి వివరించారు. కెరీర్ మొదట్లో తనుపడ్డ కష్టాలు గురించి కూడా చెప్పుకున్నాడు.
ఆ సమయంలో తన భూములు అమ్మి అప్పులు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ మోహన్ బాబు ఎమోషనల్ అయ్యారు. అలా ఒకరోజు ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి ‘అన్నయ్య మీతో సినిమా చేయాలనుకుంటున్నాను’ అని చెప్పాను. రాజకీయాల్లో విఫలమైన నన్ను సినిమాల్లో ఇంకేం చూస్తారు. అనవసరంగా డబ్బులు వృధా చేసుకోకు అని అన్నారు. ఆ మాటలతో ఎన్టీఆర్ మరోసారి తన గొప్పతనం చాటుకున్నారు అని మోహన్ బాబు అన్నారు.
బాలయ్య చిరంజీవిపై మీ అభిప్రాయం ఏంటి అంటూ ఆసక్తికర ప్రశ్న అడగగా దీనికి మోహన్ చిరంజీవి పై నాకు ఎలాంటి చెడు అభిప్రాయం లేదు. చిరంజీవి ఒక మంచి నటుడు అద్భుతమైన డాన్సర్. మేమిద్దరం కలసి ఎన్నో చిత్రాల్లో నటించాం. అల్లు రామలింగయ్య గారి అమ్మాయి సురేఖని చిరంజీవి పెళ్లి చేసుకున్నాడు. సురేఖ నాకు సోదరి లాంటిది. అంటే మన ఇంటి అమ్మాయిని చిరంజీవి పెళ్లి చేసుకున్నాడు. కాబట్టే అతను బాగున్నాడు అంటూ మోహన్ బాబు చిరంజీవి, అతని పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…