మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోలలో కళ్యాణ్ దేవ్ ఒకరు. ఈయన విజేత సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కళ్యాణ్ దేవ్ మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ భర్త అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇలా శ్రీజను వివాహం చేసుకున్న తర్వాత విజేత సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కళ్యాణ్ సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నారు.
ఈక్రమంలోనే కళ్యాణ్ దేవ్ హీరోగా పులి వాసు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “సూపర్ మచ్చి”. ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కరోనా కారణం చేత వాయిదా పడింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రం నుంచి దీపావళి పండుగ సందర్భంగా టీజర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
కళ్యాణ్ దేవ్, రియా చక్రవర్తి, రచిత రామ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ సినిమాను రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రిజ్వాన్, ఖుషి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోని తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది. అలాగే శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ అద్భుతంగా వచ్చిందని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రంలో సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, తనికెళ్ల భరణి, పోసాని, ప్రగతి కీలక పాత్రలో నటించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…