Featured

బెస్ట్ యాక్ట్రెస్ అని అవార్డులిచ్చినా అవకాశాలే లేక చివరికి టీవీ షోలకి వస్తోన్న మన్నారా చోప్రా..!

అటు బాలీవుడ్ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ బ్యాక్ గ్రౌండ్ గట్టిగానే ఉంది. కాస్తొ కూస్తో టాలెంట్ కూడా ఉంది. గ్లామర్‌గా కనిపించడానికి, ఆన్‌స్క్రీన్ రొమాన్స్ చేయడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. చేసిన సినిమాలతో బెస్ట్ యాక్ట్రెస్‌గా అవార్డులు కూడా అందుకుంది. కానీ ఆశించిన అవకాశాలే రావడం లేదు. ఇలా ఒక్క తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదు హిందీ, తమిళ ఇండస్ట్రీలలో కూడా జరుగుతోంది. ఎందుకంటే కరెక్ట్ రీజన్స్ కనిపించడం లేదు. ఇంతకీ ఎవరా హీరోయిన్ అంటే.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రాల కజిన్ సిస్టర్ మన్నార చోప్రా.

మన్నార చోప్రా సినిమా ఇండస్ట్రీకి రాకముందు మోడలింగ్ చేసింది. ఆ రకంగా సినిమా హీరోయిన్‌గా అవకాశాలు దక్కించుకుంది. ఆమె హీరోయిన్ ఎంట్రీకి తన కజిన్స్ బ్యాక్‌గ్రౌండ్ బాగానే ఉపయోగపడింది. ఆమె 2014లో వచ్చిన  ప్రేమ గీమ జాన్‌తా నయ్ అనే తెలుగు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా యూత్ ఆడియన్స్‌ను బాగానే ఆకట్టుకుంది. అదే ఏడాది జిద్ అనే హిందీ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కూడా మన్నారాకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

కానీ వరుసగా అటు హిందీలో గానీ, ఇటు తెలుగులో గానీ మన్నారా అవకాశాలు దక్కలేదు. అయితే 2015లో సన్దమారుతం అనే తమిళ సినిమాలో పోషించిన చిన్న అతిధి పాత్ర ద్వారా కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కూడా ఎంట్రీ ఇచ్చింది. అయితే తమిళంలో ఆమె సక్సెస్ కాకపోవడానికి ఇదే ఒక కారణం అని చెప్పుకున్నారు. కొంతమందికి ఏ ఇండస్ట్రీలోనైనా ముందు గెస్ట్ రోల్స్ చేస్తేనే ఆ తర్వాత హీరోయిన్ అవకాశాలు వస్తాయి. కానీ కొంతమందికి అవే అవకాశాలు రాకుండా చేస్తాయి. ఈమె విషయంలో ఇదే జరిగింది.

అదే ఏడాది మరో తమిళ సినిమాలో ఓ సాంగ్‌లో కనిపించింది. అంతే మళ్ళీ మన్నారాకు ఇప్పటి వరకు తమిళంలో హీరోయిన్‌గా కాదు కదా మరే అవకాశాలు దక్కలేదు. అయితే తెలుగులో సునీల్ హీరోగా వచ్చిన జక్కన్న సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా జనాలను ఆకట్టుకోలేదు. ఇదే ఏడాది మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ హీరోగా నటించిన తిక్క సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా గనక హిట్ అయి ఉంటే మన్నారా స్టార్ తిరిగిపోయి ఉండేది. మెగా ఫ్యామిలీ హీరోల సరసన అవకాశాలు దక్కించుకునేది.

కానీ తిక్క బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. అయినా పూరి జగన్నాధ్ తెలుగు కన్నడలో రూపొందించిన రోగ్ సినిమాలో ఓ హీరోయిన్‌గా నటించింది. పూరి బాగానే చూపించినా కూడా ఆ తర్వాత తెలుగులో కనిపించలేదు. తెలుగులో మాత్రమే కాదు మిగతా ఏ భాషలోనూ ఆమెకు అవకాశాలు రావడం లేదు. 2017లో తిక్క మూవీకి గానూ ఉత్తమ నటి 15వ సంతోషం ఫిలిం అవార్డ్స్ లో స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకుంది. ఆ తర్వాత రోగ్ సినిమాకు కూడా 16వ సంతోషం ఫిలిం అవార్డ్స్ లో  ఉత్తమ నటి స్పెషల్ జ్యూరీ అవార్డ్ దక్కించుకుంది. అయినా మన్నారా ఎందుకు అవకాశాలు అందుకోవడంలో విఫలమయిందో తెలియడం లేదు.      

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago