అటు బాలీవుడ్ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ బ్యాక్ గ్రౌండ్ గట్టిగానే ఉంది. కాస్తొ కూస్తో టాలెంట్ కూడా ఉంది. గ్లామర్‌గా కనిపించడానికి, ఆన్‌స్క్రీన్ రొమాన్స్ చేయడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. చేసిన సినిమాలతో బెస్ట్ యాక్ట్రెస్‌గా అవార్డులు కూడా అందుకుంది. కానీ ఆశించిన అవకాశాలే రావడం లేదు. ఇలా ఒక్క తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదు హిందీ, తమిళ ఇండస్ట్రీలలో కూడా జరుగుతోంది. ఎందుకంటే కరెక్ట్ రీజన్స్ కనిపించడం లేదు. ఇంతకీ ఎవరా హీరోయిన్ అంటే.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రాల కజిన్ సిస్టర్ మన్నార చోప్రా.

మన్నార చోప్రా సినిమా ఇండస్ట్రీకి రాకముందు మోడలింగ్ చేసింది. ఆ రకంగా సినిమా హీరోయిన్‌గా అవకాశాలు దక్కించుకుంది. ఆమె హీరోయిన్ ఎంట్రీకి తన కజిన్స్ బ్యాక్‌గ్రౌండ్ బాగానే ఉపయోగపడింది. ఆమె 2014లో వచ్చిన ప్రేమ గీమ జాన్‌తా నయ్ అనే తెలుగు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా యూత్ ఆడియన్స్‌ను బాగానే ఆకట్టుకుంది. అదే ఏడాది జిద్ అనే హిందీ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కూడా మన్నారాకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

కానీ వరుసగా అటు హిందీలో గానీ, ఇటు తెలుగులో గానీ మన్నారా అవకాశాలు దక్కలేదు. అయితే 2015లో సన్దమారుతం అనే తమిళ సినిమాలో పోషించిన చిన్న అతిధి పాత్ర ద్వారా కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కూడా ఎంట్రీ ఇచ్చింది. అయితే తమిళంలో ఆమె సక్సెస్ కాకపోవడానికి ఇదే ఒక కారణం అని చెప్పుకున్నారు. కొంతమందికి ఏ ఇండస్ట్రీలోనైనా ముందు గెస్ట్ రోల్స్ చేస్తేనే ఆ తర్వాత హీరోయిన్ అవకాశాలు వస్తాయి. కానీ కొంతమందికి అవే అవకాశాలు రాకుండా చేస్తాయి. ఈమె విషయంలో ఇదే జరిగింది.

అదే ఏడాది మరో తమిళ సినిమాలో ఓ సాంగ్‌లో కనిపించింది. అంతే మళ్ళీ మన్నారాకు ఇప్పటి వరకు తమిళంలో హీరోయిన్‌గా కాదు కదా మరే అవకాశాలు దక్కలేదు. అయితే తెలుగులో సునీల్ హీరోగా వచ్చిన జక్కన్న సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా జనాలను ఆకట్టుకోలేదు. ఇదే ఏడాది మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ హీరోగా నటించిన తిక్క సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా గనక హిట్ అయి ఉంటే మన్నారా స్టార్ తిరిగిపోయి ఉండేది. మెగా ఫ్యామిలీ హీరోల సరసన అవకాశాలు దక్కించుకునేది.

కానీ తిక్క బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. అయినా పూరి జగన్నాధ్ తెలుగు కన్నడలో రూపొందించిన రోగ్ సినిమాలో ఓ హీరోయిన్‌గా నటించింది. పూరి బాగానే చూపించినా కూడా ఆ తర్వాత తెలుగులో కనిపించలేదు. తెలుగులో మాత్రమే కాదు మిగతా ఏ భాషలోనూ ఆమెకు అవకాశాలు రావడం లేదు. 2017లో తిక్క మూవీకి గానూ ఉత్తమ నటి 15వ సంతోషం ఫిలిం అవార్డ్స్ లో స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకుంది. ఆ తర్వాత రోగ్ సినిమాకు కూడా 16వ సంతోషం ఫిలిం అవార్డ్స్ లో ఉత్తమ నటి స్పెషల్ జ్యూరీ అవార్డ్ దక్కించుకుంది. అయినా మన్నారా ఎందుకు అవకాశాలు అందుకోవడంలో విఫలమయిందో తెలియడం లేదు.

































