Featured

మెహబూబా బ్యూటీ అవకాశాలే కరువయ్యాయి..ఎంత ఎదురుచూస్తున్నా పిలిచేవారు లేరా..?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ సినిమాలకు ఓ బ్రాండ్ ఉన్నట్టే..ఆయన హీరోలకు తనతో సినిమా చేసిన తర్వాత మాంచి మాస్ ఇమేజ్ వచ్చేస్తుంది. ఇటీవల శ్రీకాకుళం కాలేజ్ ఫెస్టివల్‌లో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ సినిమాలలో నటించిన తర్వాత ప్రభాస్ చాలా మారిపోయాడని.. పర్ఫార్మెన్స్ పరంగా చాలా మారాడని చెప్పుకొచ్చారు. ఒక్క ప్రభాస్ మాత్రమే కాదు పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్, మహేశ్ బాబు, రాం చరణ్, అల్లు అర్జున్.. ఇలా మన హీరోలందరికీ మంచి మాస్ ఇమేజ్ వచ్చిందని తెలిపారు.

ఇక రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ కూడా సినిమా తీయడంలో కొడుకు రాజమౌళి కంటే పూరి జగన్నాధ్ బెస్ట్.. చాలా స్పీడ్‌గా సినిమా కంప్లీట్ చేస్తాడు. క్రియేట్ చేసి మరీ ఫైట్, కామెడీ ట్రాక్స్ పెడతాడు. ఈ విషయంలో పూరి జగన్నాధ్ జీనియస్ అని అందుకే ఆయన మూవీ మేకింగ్ స్టైల్ గానీ, రైటింగ్ స్టైల్ గానీ బాగా నచ్చుతాయని చెప్పారు. ఇలా అందరి ప్రశంసలు అందుకుంటున్న పూరి జగన్నాధ్ తన సినిమాలలో హీరోయిన్స్‌కు తీసుకు వచ్చే క్రేజ్ కూడా భారీ స్థాయిలోనే ఉంటుంది.

ఎప్పుడూ 150 నుంచి 200 మంది మోడల్స్‌కు సంబంధించిన ఫొటోస్ పూరి ఆల్బంలో ఉంటాయి. అయితే ఎప్పుడు ఏ అమ్మాయికి తన సినిమాలో ఛాన్స్ ఇస్తాడో ఆయన రాసుకున్న కథ డిసైడ్ చేస్తుంది. కొంత మందికి పూరి ఛాన్స్ ఇచ్చేసరికి 4-5 ఏళ్ళు సమయం కూడా పడుతుంది. పూరి హీరోయిన్స్‌ను చూపించడంలో మాస్టర్ అని చెప్పాల్సిందే. హీరోయిన్‌ను ఇంట్రడ్యూస్ చేసే విధానం.. ఎస్టాబ్లిష్ చేసే విధానంలో అలాగే హీరోతో ఉన్న కాంబినేషన్ సీన్స్‌లో ఎలివేషన్, సాంగ్‌లో చూపించే రొమాంటిక్ స్టైల్.. ఇలా ప్రతీదాంట్లో ఆయన చాలా డిఫరెంట్.

అందుకే పూరి హీరోయిన్స్‌కు మంచి క్రేజ్ ఏర్పడుతుంది. పూరి జగన్నాధ్ ఒక హీరోయిన్‌ను పరిచయం చేస్తున్నారంటే ఆ సినిమా రిలీజ్ కాకముందే టాలీవుడ్ మేకర్స్ తమ సినిమాలలో లాక్ చేసుకుంటుంటారు. అయితే కొంతమంది హీరోయిన్స్ విషయంలో మాత్రం ఎందుకనో భిన్నంగా జరుగుతోంది. ఉదాహరణ మెహబూబా సినిమా హీరోయిన్‌నే తీసుకోవచ్చు. పూరి తన కొడుకు ఆకాష్‌ను హీరోగా పరిచయం చేస్తూ స్వీయ దర్శకత్వంలో మెహబూబా సినిమాను రూపొందించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా నేహా శెట్టిని టాలీవుడ్‌కు పరిచయం చేశారు.

అందరిలాగానే మెహబూబా సినిమా పోస్టర్స్, ట్రైలర్స్ చూసి ఈమె కూడా టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్ అవుతుందనుకున్నారు. కానీ ఎందుకనో ఈమె విషయంలో రివర్స్ అయింది. ఇటీవల వచ్చిన రొమాంటిక్ మూవీ హీరోయిన్‌కు ఆ సినిమా రిలీజ్ చేయకుండానే మరో రెండు సినిమాలు కమిటయింది. కానీ అంతకముందు మెహబూబా సినిమాతో పరిచయం అయిన నేహ శెట్టిని మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. వార్తల్లో మాత్రం రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయని ప్రచారం తప్ప అఫీషియల్‌గా మాత్రం కన్‌ఫర్మ్ అయిన మూవీ లేదు. ఆమె తర్వాత వచ్చిన కృతి శెట్టి కూడా అరడజను సినిమాలతో చాలా బిజీగా ఉంది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago