Tag Archives: Yashoda

Yashoda Movie: వరల్డ్ వైడ్ యశోద 11 డేస్ కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్ సాధించిన యశోద!

Yashoda Movie:టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత మొదటిసారి యశోద అనే పాన్ ఇండియా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హరి హరీష్ దర్శకత్వంలో శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటిసారి సమంత పాన్ ఇండియా స్థాయిలో లేడీ ఓరియంటెడ్ యాక్షన్ సీక్వెన్స్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమాలో సమంత నటన ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసిన.మొదటివారం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు సునామీ సృష్టించిన ఈ సినిమా రెండవ వారం కృష్ణగారి మరణంతో కొంతమేర కలెక్షన్లు తగ్గాయి. ప్రస్తుత ఈ సినిమా తిరిగి మంచి కలెక్షన్లను అందుకొని 11 రోజులకు బ్రేక్ ఈవెంట్ సాధించి లాభాల బాటలో పయనిస్తుంది.మరి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 11 రోజులలో ఏ ఏ ప్రాంతంలో ఎంత కలెక్షన్లను రాబట్టింది అనే విషయానికి వస్తే…

నైజం 4.02 కోట్లు, సీడెడ్ 0.77 కోట్లు, ఉత్తరాంధ్ర 1.10 కోట్లు, ఈస్ట్ 0.49, వెస్ట్ 0.30, గుంటూరు 0.50, కృష్ణ 0.54, నెల్లూరు 0.25, ఏపీ, తెలంగాణ 7.97, తమిళనాడు 1. 20, హిందీ 0.57, ఓవర్సీస్ 2.68, రెస్ట్ 0.62 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఈ విధంగా ఈ సినిమా 11 రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా 13.04 కోట్ల షేర్స్ రాబట్టింది.

బయ్యర్లకు లాభాలు తెచ్చిన యశోద…
ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 11.5 షేర్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా 11 రోజులకు గాను 13. 04 కోట్లు రాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా, బయ్యర్లకు ఈ సినిమా 1.54 కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది.ఇక ముందు ముందు వచ్చే కలెక్షన్లన్నీ కూడా బయ్యర్లకు లాభాలు అనే చెప్పాలి.మొత్తానికి యశోద సినిమా 10 రోజులలో బ్రేక్ ఈవెన్ సాధించి విజయాన్ని సొంతం చేసుకుంది.

Actress Kalpika: సమంతకి వచ్చిన జబ్బు నాకు 13 ఏళ్ల నుంచి ఉంది.. కానీ సమంత స్టేజ్ 3 లో ఉంది.. నటి కల్పిక కామెంట్స్ వైరల్ !

Actress Kalpika: సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం యశోద. ఈ సినిమా నవంబర్ 11వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా 20 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టినట్లు చిత్ర బృందం వెల్లడించారు. ఈ సినిమాకు మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.

ఇక ఈ సినిమాలో సమంత ప్రధాన పాత్రలో నటించగా ఈ సినిమాలో పలువురు నటిమలు కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే సమంత మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ వ్యాధితో బాధపడుతున్నటువంటి ఈమె ప్రస్తుతం చికిత్స తీసుకుంటూ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు.

తాజాగా సమంత మయోసైటిస్ గురించి నటి కల్పిక గణేషన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈమె కూడా యశోద సినిమాలో కీలక పాత్రలో నటించారు. కల్పిక గణేషన్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సమంత అక్క పాత్రలో కూడా సందడి చేశారు.ఇక ఈ సినిమా కార్యక్రమంలో భాగంగా కల్పిగా మాట్లాడుతూ తాను కూడా సమంత లాగే మాయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్నానని వెల్లడించారు.

ఫస్ట్ స్టేజ్ లో మాయోసైటిస్..

అయితే తను గత 13 ఏళ్లగా ఈ వ్యాధితో బాధపడుతున్నానని ఇప్పటికీ వ్యాధి ఫస్ట్ స్టేజ్లో ఉన్నానని చెప్పారు. కానీ సమంత మాత్రం ప్రస్తుతం థర్డ్ స్టేజ్ లో ఉందని వెల్లడించారు. త్వరలోనే తాను సమంతను కలిసి ఈ వ్యాధి గురించి పూర్తి అవగాహన పొందాలని భావిస్తున్నానని ఈమె తెలియజేశారు. ఈ విధంగా సమంత బాధపడుతున్నటువంటి మయోసైటిస్ వ్యాధి గురించి నటి కల్పిక చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి

Samantha: భయంకరమైన వ్యాధితో పోరాడి బయటపడిన సమంత?

Samantha:సాధారణంగా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు తరచూ వారి పాత్రలకు అనుగుణంగా మేకప్ వేసుకోవడం వల్ల కొన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. అలాగే వాళ్ళు రాత్రి పగలు అనే తేడా లేకుండా సినిమా షూటింగులలో పాల్గొనడం వల్ల కొన్ని రకాల వ్యాధులతో సతమతమవుతూ ఉంటారు.ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత సైతం ఇలాంటి ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతూ వ్యాధితో పోరాడి గెలుచారని తెలుస్తోంది.

 

సమంత ఇండస్ట్రీలోకి వచ్చి అగ్రతారగా కొనసాగుతున్న సమయంలోనే ఈమె పాలీమార్ఫస్ లైట్ ఎరప్షన్ అనే తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడ్డారని తెలుస్తోంది. ఈ విధమైనటువంటి వ్యాధితో బాధపడే వారికి కాస్త సూర్య రష్మి తగిలిన వెంటనే చర్మం మొత్తం ఎర్రటి దద్దుర్లు ఏర్పడుతూ ఎంతో బాధపడతారని సమంత కూడా ఈ వ్యాధితో బాధపడ్డారని తెలుస్తోంది.

ఇలాంటి భయంకరమైన వ్యాధితో బాధపడిన సమంత ఈ వ్యాధికి సరైన చికిత్స చేయించుకుని ప్రస్తుతం ఈ వ్యాధి నుంచి బయటపడినట్లు తెలుస్తోంది.ఇక సమంత కెరియర్ విషయానికి వస్తే తాను నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇక నాగచైతన్యతో విడాకులు అనంతరం సమంత పూర్తిగా తన దృష్టిని తన కెరియర్ పై పెట్టారు.

Samantha: వరుస సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్న సమంత..

విడాకుల తర్వాత సమంత ఏకంగా ఐటమ్ సాంగు ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడంతో ఒకసారిగా ప్రేక్షకులు ఆశ్చర్య పోయినప్పటికీ ఈ పాటతో ఈమె కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా విపరీతమైన సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే తనకు బాలీవుడ్ అవకాశాలు కూడా వస్తున్నట్లు సమాచారం. యశోద ఖుషి వంటి సినిమా షూటింగులలో పాల్గొంటున్నారు. ఇక ఈమె నటించిన మొట్టమొదటి పౌరాణిక చిత్రం శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.