Tag Archives: you tude stars

Shanmukh : యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ ఇంటిని చూస్తే..! అక్కడ నుంచి కదల్లేరు..! అంత విలాసంగా..!

Shanmukh : యూట్యూబ్ స్టార్ షణ్ముక్ జస్వంత్ గురించి పెద్దగా పరిచయం చేయనక్కర లేదు. యూ ట్యూబ్ లో షన్నూకు మిలియన్లలో ఫాలోవర్లు ఉన్నారు. తాజా బిగ్ బాస్ తో మరింత పాపులర్ అయ్యడు షణ్ముఖ్. చివరి దాకా టైటిల్ రేస్ లో ఉన్నప్పటికీ సిరితో మితిమీరిన రోమాన్స్ తో కప్పుకు దూరం అయ్యారు.

Shanmukh : యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ ఇంటిని చూస్తే..! అక్కడ నుంచి కదల్లేరు..! అంత విలాసంగా..!

సిరితో హగ్గింగ్, కిస్సింగ్ వ్యవహారాలు షన్నూని ట్రోఫికి దూరం చేసింది. దీంతో బిగ్ బాస్ సీజన్ 5లో వీజే సన్నీ విజేతగా నిలువగా. షణ్ముఖ్ జస్వంత్ రన్నరప్ గా నిలిచారు. అయితే సిరితో తనకు ఉంది కేవలం ఫ్రెండ్ షిప్ మాత్రమే అని షన్నూ చాలాసార్లు చెప్పారు.

అయితే సిరితో కిస్సుల గురించి, కౌగిలించుకోవడంపై గతంలో సిరి తల్లి కూడా ఫైర్ అయింది. సిరితో ఈ ఓవర్ రొమాన్స్ షణ్ముఖ్ కొంప ముంచిందని అంటున్నారు నెటిజెన్లు.  అయితే ఇటీవల విడుదలైన బిగ్ బాస్ బజ్ ఇంటర్య్వూతో అసలు షన్నూ ఏంటో అర్థమయ్యిందని, అతని నిజాయితీ చూస్తుంటే ముచ్చట వేస్తుందని.. పలువురు నెటిజెన్లు అభిప్రాయపడ్డారు. 

హోం టూర్ లో అతడి ఇల్లు..

షణ్ముఖ్ స్వస్థలం వైజాగ్. అయితే కెరీర్ కోసం షణ్ముఖ్ హైదరాబాద్ లో ఉంటున్నారు. అయితే తాజాగా వైజాగ్ లోని షన్నూ సొంత ఇంటి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది షన్నూ తల్లి. షన్నూ ఫోటోలు… గిఫ్టుల గురించి షన్నూ తల్లి వివరించింది. ఈ హోం టూర్ లో షణ్ముఖ్ ఇల్లు ఎంత బాగుందో మీరు చూడండి.

షణ్ముఖ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. ప్రైజ్ మనీ కంటే ఎక్కువే సంపాదించాడుగా..!

టైటిల్ ఫేవరేట్ గా 19 మందిలో ఒకడిగా హౌస్ లో అడుగుపెట్టిన షణ్ముఖ్ జశ్వంత్.. రన్నర్ గా నిలవాల్సి వచ్చింది. అతడు ఒంటరిగా గేమ్ ఆడితే గెలిచేవాడేమో అనే మాటలు కూడా వినపడుతున్నాయి. సిరితో స్నేహం కంటే మరో స్టెప్ ఎక్కువగా ఎమోషనల్ కావడంతోనే అతడికి మైనస్ అయిందంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. హౌస్ నుంచి బయటకు వచ్చిన వారిలో ఎక్కువగా యాంకర్ రవి సంపాదించాడు. అతడు దాదాపు రూ.90 లక్షల వరకు వెనుకేసినట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే రవి హౌస్ లో ఉన్నంత వరకు ఎక్కువగా షణ్ముఖ్ ను తమ్ముడిగా ట్రీట్ చేస్తూ.. దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. రవికి ఎన్ని పేర్లు పెట్టినా నవ్వుకుంటూనే స్వీకరించాడు. కానీ అతడు అనూహ్యంగా 12వ వారంలోనే బయటకు వచ్చాడు.

షణ్ముఖ్ మొదట్లో 4 వారాల వరకు టాప్ లోనే కొనసాగాడు. చాలామంది ఈ సారి షణ్ముఖ్ జశ్వంత్ కే టైటిల్ వస్తుందని కూడా అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయిపోయింది. సన్నీ అనూహ్యంగా ముందుకు వెళ్లాడు. ఎదుటివారి ఎత్తుగడలను చిత్తు చేస్తూ బ్రహ్మగా పేరు తెచ్చుకున్న షణ్ముఖ్.. సిరి, జెస్సీతో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేశాడు. కానీ సన్నీకి వచ్చే మద్ధతు మాత్రం బయట విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా హగ్గులు, కిస్సింగ్ లే అతడి పరాజయానికి కారణం అయ్యాయని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి.

ఇక అతడి రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం ఓ వార్త వైరల్ అవుతోంది. అతడు దాదాపు వారానికి రూ.4లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక అతు యాంకర్ రవి తర్వాత ఎక్కవగా సంపాదించింది షణ్ముఖ్ కావడం విశేషం. ఈ క్రమంగా చూస్తే.. విన్నర్ కు ఇచ్చిన ప్రైజ్ మనీ రూ.50 లక్షల కంటే.. షణ్ముఖ్ జశ్వంత్ కు వచ్చిన ప్రైజ్ మనీనే ఎక్కువగా ఉంది. పదిహేను వారాలకు అతడు రూ.65లక్షల వరకు తీసుకున్నట్లు సమాచారం.

రోజురోజుకు పడిపోతున్న షణ్ముఖ్ గ్రాఫ్.. కారణం అదే అంటున్న నెటిజన్లు..?

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లోకి యూట్యూబ్ స్టార్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న షణ్ముక్ ఎన్నో అంచనాలు నడుమ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యాడు.ఇలా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన అప్పటి నుంచి ప్రతి వారం ఎలిమినేషన్ లో ఉన్నటువంటి షణ్ముఖ్ అత్యధిక ఓట్లు సంపాదించుకొని మొదటి స్థానంలో ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో షణ్ముఖ్ గ్రాఫ్ పడిపోతున్నట్లు పలు సర్వేలు వెల్లడించాయి.

సోషల్ మీడియా ద్వారా ఎంతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న షణ్ముక్ గ్రాఫ్ పడిపోవడానికి కారణం సిరి అని ఎంతోమంది నెటిజన్లు భావిస్తున్నారు. ఈ సీజన్ మొదట్లో టాస్క్ లో గట్టిపోటీ ఇచ్చిన షణ్ముఖ ప్రస్తుతం సిరితో గడపడానికే టైం సరిపోతుంది. నిత్యం సిరితో మాటలు పెట్టుకోవడం గొడవలు పడటం అలగడం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే షణ్ముఖ్ వ్యవహార శైలికి ఎంతో మంది నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇతని అభిమానించే వారికి కూడా చివరికి విసుగు తెప్పించేలా వీరు ప్రవర్తిస్తుండడంతో ఈయన గ్రాఫ్ అమాంతం పడిపోయిందని చెప్పవచ్చు. నిత్యం సిరితో గడపడం వల్ల షణ్ముఖ్ టాస్క్ లో కూడా పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు.

బయట ఎంతో మంది కంటెస్టెంట్ లకు ఫేవరెట్ కంటెస్టెంట్ గా ఉన్నటువంటి షణ్ముఖ్ చివరికి వారి చేతనే విమర్శల పాలవుతున్నారు. ఏది ఏమైనా షణ్ముఖ్ ఇప్పుడైనా ఆటపై శ్రద్ధ చూపకపోతే ఇతను డేంజర్ జోన్ లో పడే అవకాశాలు ఉన్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. ఇక 19 మందితో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పదిమంది కంటెస్టెంట్ లు ఎలిమినేట్ కాగా మరొకరు కూడా ఎలిమినేట్ కానున్నారు. ఈ క్రమంలోనే ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయం గురించి ఎంతో ఆత్రుత ఏర్పడింది.