బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లోకి యూట్యూబ్ స్టార్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న షణ్ముక్ ఎన్నో అంచనాలు నడుమ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యాడు.ఇలా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన అప్పటి నుంచి ప్రతి వారం ఎలిమినేషన్ లో ఉన్నటువంటి షణ్ముఖ్ అత్యధిక ఓట్లు సంపాదించుకొని మొదటి స్థానంలో ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో షణ్ముఖ్ గ్రాఫ్ పడిపోతున్నట్లు పలు సర్వేలు వెల్లడించాయి.
సోషల్ మీడియా ద్వారా ఎంతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న షణ్ముక్ గ్రాఫ్ పడిపోవడానికి కారణం సిరి అని ఎంతోమంది నెటిజన్లు భావిస్తున్నారు. ఈ సీజన్ మొదట్లో టాస్క్ లో గట్టిపోటీ ఇచ్చిన షణ్ముఖ ప్రస్తుతం సిరితో గడపడానికే టైం సరిపోతుంది. నిత్యం సిరితో మాటలు పెట్టుకోవడం గొడవలు పడటం అలగడం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే షణ్ముఖ్ వ్యవహార శైలికి ఎంతో మంది నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇతని అభిమానించే వారికి కూడా చివరికి విసుగు తెప్పించేలా వీరు ప్రవర్తిస్తుండడంతో ఈయన గ్రాఫ్ అమాంతం పడిపోయిందని చెప్పవచ్చు. నిత్యం సిరితో గడపడం వల్ల షణ్ముఖ్ టాస్క్ లో కూడా పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు.
బయట ఎంతో మంది కంటెస్టెంట్ లకు ఫేవరెట్ కంటెస్టెంట్ గా ఉన్నటువంటి షణ్ముఖ్ చివరికి వారి చేతనే విమర్శల పాలవుతున్నారు. ఏది ఏమైనా షణ్ముఖ్ ఇప్పుడైనా ఆటపై శ్రద్ధ చూపకపోతే ఇతను డేంజర్ జోన్ లో పడే అవకాశాలు ఉన్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. ఇక 19 మందితో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పదిమంది కంటెస్టెంట్ లు ఎలిమినేట్ కాగా మరొకరు కూడా ఎలిమినేట్ కానున్నారు. ఈ క్రమంలోనే ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయం గురించి ఎంతో ఆత్రుత ఏర్పడింది.
సినీ రంగంలో సాధారణంగా ఒక హీరో, కొన్ని ఎంపిక చేసిన హీరోయిన్‌లతోనే ఎక్కువ సినిమాలు చేస్తుంటారు. ముఖ్యంగా గత కాలంలో…
దక్షిణ భారతీయుల రోజువారీ ఆహారంలో ఇడ్లీ, దోశలకు ప్రత్యేక స్థానం ఉంది. వేగవంతమైన జీవనశైలిలో సమయం ఆదా కోసం చాలామంది…
మధుమేహం (డయాబెటిస్) వల్ల వచ్చే సమస్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలంగా షుగర్ నియంత్రణలో లేకపోతే నరాలపై ప్రభావం పడే…
నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…
నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…
సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…