Featured

షణ్ముఖ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. ప్రైజ్ మనీ కంటే ఎక్కువే సంపాదించాడుగా..!

టైటిల్ ఫేవరేట్ గా 19 మందిలో ఒకడిగా హౌస్ లో అడుగుపెట్టిన షణ్ముఖ్ జశ్వంత్.. రన్నర్ గా నిలవాల్సి వచ్చింది. అతడు ఒంటరిగా గేమ్ ఆడితే గెలిచేవాడేమో అనే మాటలు కూడా వినపడుతున్నాయి. సిరితో స్నేహం కంటే మరో స్టెప్ ఎక్కువగా ఎమోషనల్ కావడంతోనే అతడికి మైనస్ అయిందంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. హౌస్ నుంచి బయటకు వచ్చిన వారిలో ఎక్కువగా యాంకర్ రవి సంపాదించాడు. అతడు దాదాపు రూ.90 లక్షల వరకు వెనుకేసినట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే రవి హౌస్ లో ఉన్నంత వరకు ఎక్కువగా షణ్ముఖ్ ను తమ్ముడిగా ట్రీట్ చేస్తూ.. దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. రవికి ఎన్ని పేర్లు పెట్టినా నవ్వుకుంటూనే స్వీకరించాడు. కానీ అతడు అనూహ్యంగా 12వ వారంలోనే బయటకు వచ్చాడు.

షణ్ముఖ్ మొదట్లో 4 వారాల వరకు టాప్ లోనే కొనసాగాడు. చాలామంది ఈ సారి షణ్ముఖ్ జశ్వంత్ కే టైటిల్ వస్తుందని కూడా అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయిపోయింది. సన్నీ అనూహ్యంగా ముందుకు వెళ్లాడు. ఎదుటివారి ఎత్తుగడలను చిత్తు చేస్తూ బ్రహ్మగా పేరు తెచ్చుకున్న షణ్ముఖ్.. సిరి, జెస్సీతో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేశాడు. కానీ సన్నీకి వచ్చే మద్ధతు మాత్రం బయట విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా హగ్గులు, కిస్సింగ్ లే అతడి పరాజయానికి కారణం అయ్యాయని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి.

ఇక అతడి రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం ఓ వార్త వైరల్ అవుతోంది. అతడు దాదాపు వారానికి రూ.4లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక అతు యాంకర్ రవి తర్వాత ఎక్కవగా సంపాదించింది షణ్ముఖ్ కావడం విశేషం. ఈ క్రమంగా చూస్తే.. విన్నర్ కు ఇచ్చిన ప్రైజ్ మనీ రూ.50 లక్షల కంటే.. షణ్ముఖ్ జశ్వంత్ కు వచ్చిన ప్రైజ్ మనీనే ఎక్కువగా ఉంది. పదిహేను వారాలకు అతడు రూ.65లక్షల వరకు తీసుకున్నట్లు సమాచారం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago