బిగ్ బాస్ సీజన్ 5 నిన్నటితో ముగిసింది. అందరూ అనుకున్నట్లుగానే సన్నీ విన్నర్ గా నిలిచాడు. రన్నర్ షణ్ముఖ్ నిలిచిన విషయం తెలిసిందే. అయితే టైటిల్ రేసులో ఎక్కువగా మొదటి నుంచి కూడా షణ్ముఖ్ పైనే నమ్మకం ఉండేది. కానీ సిరితో అతడు సాగించిన స్నేహం అనే ముసుగులో.. హగ్గులు ఇచ్చుకోవడం.. కిస్సులు పెట్టడం లాంటివి చేయడంతో అతడి గ్రాఫ్ తగ్గిపోయిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
నిజానికి బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్‌లో అందరికంటే ఎక్కువ క్రేజ్ ఉన్నది షణ్ముఖ్ జస్వంత్‌కి మాత్రమే. ఒక యూట్యూబర్‌కి 4.4 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉండటం అంటే సామన్యమైన విషయం కాదు. ఒకరకంగా చెప్పాలంటే అతను సోషల్ మీడియాలో సూపర్ స్టార్ కిందే లెక్కే.. ఎవరి సపోర్ట్ లేకుండా.. కేవలం యూట్యూబ్ వీడియోలు, వెబ్ సిరీస్‌లతో ఇంత మంది ఫాలోవర్స్‌ని రాబట్టడం అంటే చిన్న విషయం కాదు. అంత పాపులారిటీ ఉన్న అతడు రన్నర్గా నిలవడానికి కారణం కేవలం అతడు సోంతంగా ఆట ఆడలేదని.. సిరి స్నేహంమే అతడిని చెడగొట్టిందని నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
ఇక ఫినాలే స్టేజ్ పై విన్నర్ గా నిలిచిన సన్నీని అదిరిపోయే స్పీచ్ ఇచ్చాడు. ఇంతటి విజయానికి కారణం తన వెనుక ఉన్న 19 మంది కంటెస్టెంట్లతో పాటు.. అందరూ మచ్చాలు సపోర్ట్ గా నిలిచారనన్నారు. వారందరికీ తను ప్రామిస్ చేస్తున్నానని.. తన నుంచి ఎంటర్ టైన్ మెంట్ ఎప్పుడూ ఉంటుందని చెప్పుకొచ్చాడు.
ఇక తర్వాత రన్నర్ స్పీచ్ కావాలి అని నాగార్జున అనగానే.. షణ్ముఖ్ మైక్ తీసుకొని మాట్లాడాడు. ఇక ఫైనల్ స్పీచ్ లో ‘‘పర్లేదు.. పర్లేదు.. విన్నింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్.. ఆట ఎలా ఆడాం అన్నదే ముఖ్యం’’ అనే స్టేట్ మెంట్ ఇచ్చాడు. దీనిపై నెటిజన్లు ఓ రేంజ్ లో ఆడేసుకున్నారు. విజయం ముఖ్యం కాదు అన్నప్పుడు హౌస్ లో ఇన్ని రోజులు ఎందుకు ఉన్నట్లు అంటూ.. తిట్టిపోస్తున్నారు. రన్నర్ గా నిలిచినా అతడి వక్రముద్ది మాత్రం మార్చుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…