బిగ్ బాస్ సీజన్ -5 ముగిసింది. వీజే సన్నీ విజేతగా నిలిచారు. దాదాపు 15 వారాల పాటు హౌజ్ లో గడిపిన కంటెస్టెంట్లు తమతమ విషయాలను వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా అందరిలో అంచనాలు క్రియేట్ చేసిన శ్రీరామ్ చంద్ర టాప్ -3లో నిలిచారు.
ఇండియన్ ఐడల్ గా బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లిన తర్వాత.. ఫైనల్ బరిలో ఖచ్చితంగా శ్రీరామ్ ఉంటారని ప్రేక్షకులు ముందు నుంచే అనుకుంటున్నారు. అయితే టాప్ 3తోనే శ్రీరామ్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇండియన్ ఐడల్ గా దేశవ్యాప్తంగా సుపరిచితమైన శ్రీరామచంద్రకు సోనూ సూద్, శంకర్ మహాదేవన్ వంటి వారూ కూడా మద్దతు పలికారు.
అయితే తన బిగ్ బాస్ జర్నీ గురించి తాజాగా శ్రీరామ చంద్ర కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అయితే తన ఓటమికి కారణాలు తెలియవని.. నా ఆటను నేను ఆడానని.. కానీ ప్రేక్షక్షుల నిర్ణయాన్ని గౌరవిస్తా అన్నారు. గతంలో ఇండియన్ ఐడల్ -5 గెలిచానని.. బిగ్ బాస్ -5 కూడా గెలుస్తాననే నమ్మకం ఉండేదని… సెంటిమెంట్ వర్కవుట్ కాలేదన్నారు.
సన్నీ, షణ్మక్ ఇద్దరూ నాకు మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చారు. ఇక హమీదాతో తన రిలేషన్ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు శ్రీరామ్ మేం ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అని.. క్లోజ్ అవుతున్న క్రమంలోనే హమీదా ఎలిమినేట్ అయ్యారని.. ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలియదని శ్రీరామ చంద్ర చెప్పారు.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…