Tag Archives: ys jagan mohan reddy

YS Jagan Mohan Reddy: ఏప్రిల్ నెలలో జగన్ మాజీ సీఎం అవుతారు.. చంద్రబాబు కామెంట్స్ వైరల్!

YS Jagan Mohan Reddy: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గురించి చంద్రబాబు మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అవుతారని మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎక్కడికో వెళ్లిపోతారు కానీ అమరావతి మాత్రం ఇక్కడే ఉంటుందని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

అమరావతి రాజధానిపై విచారణను సుప్రీంకోర్టు కూడా ఏప్రిల్ కే వాయిదా వేసిందన్నారు. నిధులు, విధులకు సంబంధించి సర్పంచ్ లకు సర్వ అధికారాలు కల్పించేలా 73, 74 రాజ్యాంగ సవరణలు అమలు చేసి తీరతాం. రాష్ట్ర బడ్జెట్లో ఐదు శాతం పంచాయతీలు సర్పంచులకు కేటాయిస్తామని రానున్న ఐదు సంవత్సరాలలో 10% బడ్జెట్ కేటాయిస్తామని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

ఇకపోతే తాము అధికారంలోకి వస్తే కనుక సర్పంచులు ఎంపీటీసీలు, జడ్పీటీసీల వేతనం కూడా పెంచుతామని ఈయన వెల్లడించారు. ప్రజలు తమకు సేవ చేయాలని సర్పంచ్లను ఎన్నుకుంటే జగన్ మాత్రం వాలంటీర్లను ఎన్నుకున్నారని వాలంటీర్లు ప్రజలకు కాకుండా జగన్ కి సేవ చేస్తున్నారంటూ ఈయన మండిపడ్డారు.

సీఎం పదవిపై జోస్యం చెప్పిన బాబు..

ఇక జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో చిచ్చు ఉంటే మనపై పడితే మనం ఏం చేస్తాము ఇన్ని రోజులు జగనన్న వదిలిన బాణాన్ని అంటూ రాష్ట్రమంతా తిరిగిన జగన్ చెల్లి షర్మిల ఇప్పుడు తనకు వ్యతిరేకంగా వెళుతుంది. ఆయన తల్లి చెల్లి వ్యవహారాన్ని తాను చూసుకోకపోతే మాకేంటి సంబంధం అంటూ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు కురిపించారు. ఏది ఏమైనా ఏప్రిల్ నెలకు జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం అవుతారంటూ చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

మద్యం ప్రియులకు శుభవార్త.. సీఎం జగన్ సంచలన నిర్ణయం ..!

2019 లో జరిగిన సాధారణ ఎన్నికలకు ముందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తాను సీఎం అయిన తర్వాత మద్యపానాన్ని విడతల వారీగా నిషేదిస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే 2019 లో అత్యధిక అసెంబ్లీ స్థానాలను గెలుచుకొని.. మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక సీట్లతో అతడు తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వచ్చాడు.

మద్యం విషయంలో కూడా నిషేదాన్ని విడతల వారీగా అమలు పరుచుకుంటూ వచ్చాడు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఈ సంవత్సరం మద్యం దుకాణాలను తగ్గించడం లేదంటూ.. మద్యం ప్రియులకు శుభవార్త చెప్పాడు. అంతక ముందు ఉన్న మద్యం దుకాణాలనే పొడిగిస్తున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం అకస్మాత్తుగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో కొంతమంది ఖుషీగా ఫీల్ అవుతుంటే మరికొంత మంది దీని వెనకాల ఏదో జరుగుతుందంటూ మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.

ఇదిలా ఉండగా.. గత ఏడాది ఇదే సమయంలో మద్యం ధరలను తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం కూడా అవే ధరలు కొనసాగనున్నట్లు సమాచారం. మీడియం, ప్రీమియం బ్రాండ్ ధరలను సుమారు 25 శాతం తగ్గించిన విషయం తెలిసిందే. బీరు, రెడీ టూ డ్రింక్ మ‌ద్యం ధ‌ర‌ల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం కూడా మద్యం దుకాణాలను తగ్గించడం లేదు కావునా.. ధరలు కూడా అలానే ఉంటాయని ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

అగ్రిగోల్డ్ డిపాజిటర్ల ఖాతాల్లో డబ్బు జమ.. ఈ పాపం గత ప్రభుత్వానిదే అంటూ మండిపాటు..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అగ్రిగోల్డ్‌ డిపాజిట్లరకు నగదు జమ చేశారు. లక్షల మంది బాధితుల ఖాతాల్లో రూ.666.84 కోట్ల న‌గ‌దు జ‌మ చేసినట్లు సీఎం పేర్కొన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో సీఎం జ‌గ‌న్ మాట్లాడారు. కష్టపడి సంపాదించుకున్న‌ సొమ్మును అగ్రిగోల్డ్‌లో పొదుపు చేసి ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌లు నష్టపోయారని చెప్పారు. ఇంటింటికీ వెళ్లి బాధితులను గుర్తించామని, వారిని ఆదుకుంటున్నామ‌ని వైఎస్ జ‌గ‌న్ తెలిపారు.

రూ.10వేల లోపు డిపాజిట్‌ చేసిన 3.86 లక్షల మంది బాధితులకు రూ.207.16 కోట్లు ఇస్తున్న‌ట్లు చెప్పారు. దాదాపుగా 7లక్షల పైచిలుకు డిపాజిటర్లకు 666.84 కోట్లు ఇస్తున్నామని… మొత్తంగా అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లు 10.4 లక్షల మందికి రూ.905 కోట్లకు పైగా ఆర్థిక సహాయం చేశామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం బాధితులకు న్యాయం చేశామని… రూ.20వేల లోపు డిపాజిట్‌ చేసిన కుటుంబాలు అన్నింటికీ.. కనీసం రూ.20 వేలైన ఇచ్చే కార్యక్రమం పూర్తయిందని తెలిపారు.

అగ్రిగోల్డ్ బాధితుల‌ను ఆదుకుంటామ‌ని ఎన్నికల ముందు ఇచ్చిన‌ హామీని నిలబెట్టుకున్నామని చెప్పారు. ప్రైవేట్ సంస్థ బాధితులకు ప్ర‌భుత్వం ఇలా న్యాయం చేయ‌డం దేశంలో ఎక్కడా లేదని ఆయ‌న తెలిపారు. ప్రజల కోసం ప్రభుత్వం బాధ్యతగా డ‌బ్బు చెల్లించిందని సీఎం అన్నారు. గత ప్రభుత్వం 2015 లో అగ్రిగోల్డ్ బాధితులుకు న్యాయం చేస్తామని చెప్పి.. మోసం చేసిందని మండిపడ్డారు.

ఇటువంటి మోసాలను గత ప్రభుత్వం ఐదేళ్లుగా చేసిందని గుర్తు చేశారు సీఎం జగన్. కోర్డులో ఈ కేసులు పెండింగ్ లో ఉన్నాయని.. అవన్నీ క్లియర్ అయిన తర్వాత అగ్రిగోల్డ్ ఆస్తులను విక్రయించి వచ్చిన అమౌంట్ ను ప్రభుత్వం తీసుకుంటుందని.. మిగిలిన సొమ్మును డిపాజిటర్ల ఖాతాలను జమ చేస్తామని హామీ ఇచ్చారు.

బొమ్మ అదిరింది వివాదం.. నాగబాబు, శ్రీముఖికి జగన్ ఫ్యాన్స్ షాక్..?

ఈ మధ్య కాలంలో కామెడీ షోలలో ప్రముఖులను ఇమిటేట్ చేసి కామెడీ పండించటం కామన్ అయిపోయింది. సదరు సెలబ్రిటీలు ఆ స్కిట్లను పెద్దగా పట్టించుకోకపోయినా వాళ్ల అభిమానులు మాత్రం సీరియస్ గా స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. జీ తెలుగు ఛానల్ లో ప్రసారమయ్యే బొమ్మ అదిరింది షోలో ఏపీ సీఎం జగన్ ను ఇమిటేట్ చేస్తూ ఒక స్కిట్ టెలీకాస్ట్ అయింది.

ఈ స్కిట్ పై జగన్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమెడియన్లు సద్దాం, రియాజ్‌లను, శ్రీముఖిని, జడ్జీ నాగబాబును కూడా టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. కమెడియన్ రియాజ్ ఇప్పటికే స్పందించి క్షమాపణ కోరాడు. మొన్న ప్రసారమైన తొలి ఎపిసోడ్ పై జగన్ ఫ్యాన్స్ బండ బూతులు తిడుతున్నారు. రేటింగ్స్ పెంచుకోవడం కోసం ప్రముఖులను టార్గెట్ చేసి చీప్ ట్రిక్స్ ప్లే చేయడం సరికాదని సూచనలు చేస్తున్నారు.

జబర్దస్త్ షో నుంచి బయటకు వచ్చిన నాగబాబు ఆ షోకు పోటీగా జీ తెలుగులో అదిరింది షో ను మొదలుపెట్టారు. అయితే ఆశించిన స్థాయిలో రేటింగ్స్ రాబట్టడంలో అదిరింది షో ఫ్లాప్ అయింది. దీంతో షోకు బొమ్మ అదిరింది అని పేరు మార్చి యాంకర్ ను కూడా మార్చేశారు. సెలబ్రిటీ ప్రీమియర్ లీగ్ పేరుతో రౌడీ బోయ్స్, గల్లీ బాయ్స్ టీంలు బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, రాజశేఖర్, జగన్, చంద్రబాబులను ఇమిటేట్ చేస్తూ స్కిట్ చేశారు.

సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని కించపరిచే సరికి అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికలలో ఈ విషయం గురించే చర్చ చెబుతోంది. షోలో విమర్శలు చేసి సోషల్ మీడియాలో సారీ చెబితే సరిపోతుందా..? అని ప్రశ్నిస్తున్నారు. కొందరు అభిమానులు అయితే ఏకంగా షోను ఆపేయాలని డిమాండ్ చేస్తూ ఉండటం గమనార్హం.