ఈ మధ్య కాలంలో కామెడీ షోలలో ప్రముఖులను ఇమిటేట్ చేసి కామెడీ పండించటం కామన్ అయిపోయింది. సదరు సెలబ్రిటీలు ఆ స్కిట్లను పెద్దగా పట్టించుకోకపోయినా వాళ్ల అభిమానులు మాత్రం సీరియస్ గా స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. జీ తెలుగు ఛానల్ లో ప్రసారమయ్యే బొమ్మ అదిరింది షోలో ఏపీ సీఎం జగన్ ను ఇమిటేట్ చేస్తూ ఒక స్కిట్ టెలీకాస్ట్ అయింది.
ఈ స్కిట్ పై జగన్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమెడియన్లు సద్దాం, రియాజ్‌లను, శ్రీముఖిని, జడ్జీ నాగబాబును కూడా టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. కమెడియన్ రియాజ్ ఇప్పటికే స్పందించి క్షమాపణ కోరాడు. మొన్న ప్రసారమైన తొలి ఎపిసోడ్ పై జగన్ ఫ్యాన్స్ బండ బూతులు తిడుతున్నారు. రేటింగ్స్ పెంచుకోవడం కోసం ప్రముఖులను టార్గెట్ చేసి చీప్ ట్రిక్స్ ప్లే చేయడం సరికాదని సూచనలు చేస్తున్నారు.
జబర్దస్త్ షో నుంచి బయటకు వచ్చిన నాగబాబు ఆ షోకు పోటీగా జీ తెలుగులో అదిరింది షో ను మొదలుపెట్టారు. అయితే ఆశించిన స్థాయిలో రేటింగ్స్ రాబట్టడంలో అదిరింది షో ఫ్లాప్ అయింది. దీంతో షోకు బొమ్మ అదిరింది అని పేరు మార్చి యాంకర్ ను కూడా మార్చేశారు. సెలబ్రిటీ ప్రీమియర్ లీగ్ పేరుతో రౌడీ బోయ్స్, గల్లీ బాయ్స్ టీంలు బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, రాజశేఖర్, జగన్, చంద్రబాబులను ఇమిటేట్ చేస్తూ స్కిట్ చేశారు.
సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని కించపరిచే సరికి అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికలలో ఈ విషయం గురించే చర్చ చెబుతోంది. షోలో విమర్శలు చేసి సోషల్ మీడియాలో సారీ చెబితే సరిపోతుందా..? అని ప్రశ్నిస్తున్నారు. కొందరు అభిమానులు అయితే ఏకంగా షోను ఆపేయాలని డిమాండ్ చేస్తూ ఉండటం గమనార్హం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…