బొమ్మ అదిరింది వివాదం.. నాగబాబు, శ్రీముఖికి జగన్ ఫ్యాన్స్ షాక్..?

0
382

ఈ మధ్య కాలంలో కామెడీ షోలలో ప్రముఖులను ఇమిటేట్ చేసి కామెడీ పండించటం కామన్ అయిపోయింది. సదరు సెలబ్రిటీలు ఆ స్కిట్లను పెద్దగా పట్టించుకోకపోయినా వాళ్ల అభిమానులు మాత్రం సీరియస్ గా స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. జీ తెలుగు ఛానల్ లో ప్రసారమయ్యే బొమ్మ అదిరింది షోలో ఏపీ సీఎం జగన్ ను ఇమిటేట్ చేస్తూ ఒక స్కిట్ టెలీకాస్ట్ అయింది.

ఈ స్కిట్ పై జగన్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమెడియన్లు సద్దాం, రియాజ్‌లను, శ్రీముఖిని, జడ్జీ నాగబాబును కూడా టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. కమెడియన్ రియాజ్ ఇప్పటికే స్పందించి క్షమాపణ కోరాడు. మొన్న ప్రసారమైన తొలి ఎపిసోడ్ పై జగన్ ఫ్యాన్స్ బండ బూతులు తిడుతున్నారు. రేటింగ్స్ పెంచుకోవడం కోసం ప్రముఖులను టార్గెట్ చేసి చీప్ ట్రిక్స్ ప్లే చేయడం సరికాదని సూచనలు చేస్తున్నారు.

జబర్దస్త్ షో నుంచి బయటకు వచ్చిన నాగబాబు ఆ షోకు పోటీగా జీ తెలుగులో అదిరింది షో ను మొదలుపెట్టారు. అయితే ఆశించిన స్థాయిలో రేటింగ్స్ రాబట్టడంలో అదిరింది షో ఫ్లాప్ అయింది. దీంతో షోకు బొమ్మ అదిరింది అని పేరు మార్చి యాంకర్ ను కూడా మార్చేశారు. సెలబ్రిటీ ప్రీమియర్ లీగ్ పేరుతో రౌడీ బోయ్స్, గల్లీ బాయ్స్ టీంలు బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, రాజశేఖర్, జగన్, చంద్రబాబులను ఇమిటేట్ చేస్తూ స్కిట్ చేశారు.

సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని కించపరిచే సరికి అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికలలో ఈ విషయం గురించే చర్చ చెబుతోంది. షోలో విమర్శలు చేసి సోషల్ మీడియాలో సారీ చెబితే సరిపోతుందా..? అని ప్రశ్నిస్తున్నారు. కొందరు అభిమానులు అయితే ఏకంగా షోను ఆపేయాలని డిమాండ్ చేస్తూ ఉండటం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here