Taraka Ratna : స్టార్లందరూ పుస్తకాల మీద అట్టలయ్యారు… ఎన్టీఆర్ మాత్రమే పూజ మందిరంలో దేవుడయ్యాడు : నందమూరి తారక రత్న

Taraka ratna : ఎన్టీఆర్ నట వారసుడిగా తెలుగు సినిమాకు పరిచయమైన ఎన్టీఆర్ కుమారుడు మోహన కృష్ణ తనయుడు తారక రత్న ఒకేసారి తొమ్మిది సినిమాలను ఒప్పుకుని అప్పట్లో రికార్డు సృష్టించాడు. అయితే మొదటి సినిమా ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ పర్వాలేదానిపించినా మిగిలిన సినిమాలు ఎపుడు వచ్చాయో ఎపుడు పోయాయో కూడా తెలియకుండా వెళ్లిపోయాయి. ఇక సినిమాలను తగ్గించిన తారక రత్న మధ్యలో ఒకసారి రవిబాబు సినిమా ‘అమరావతి’ లో విలన్ పాత్రలో ఆదరగొట్టాడు. ఇక మళ్ళీ చాలా రోజులకు వెబ్ సిరీస్ తో అలరించిన తారక రత్న ఈసారి సినిమాతో కాదు పొలిటికల్ స్పీచ్ తో వైరల్ అవుతున్నాడు. తన తాతయ్య ఎన్టీఆర్ గురించి గొప్పగా మాట్లాడి అభిమానులను ఆకర్శించారు.

ఎన్టీఆర్ దేవుడు… సమాజానికి ఎంతో చేసారు…

తారక రత్న ప్రస్తుతం తెల్ల గడ్డం పెట్టుకుని టోటల్ లుక్ మార్చేశాడు. ఇక ఇటీవల గుంటూరులో తన తాతయ్య ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ చేసిన ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ గారి గురించి స్పీచ్ అదరగొట్టాడు. దేవుడైనా ఎన్టీఆరే, రాక్షసుడైనా ఎన్టీఆరే అంటూ గూస్ బంప్స్ ఇచ్చే స్పీచ్ ఇచ్చాడు. కేవలం సినిమాలతో ఎన్టీఆర్ గొప్పవాడు కాలేదంటూ రాముడైనా ఆయనే రావణాసురుడైనా ఆయనే, కృష్ణుడైనా ఆయనే, కీచకుడైనా ఆయనే అంటూ తారక రత్న వర్ణించాడు. ఆయన సినిమాలతోనే గొప్పవాడు కాలేదు. కేవలం పది సినిమాలు సంవత్సరానికి ఆడే సమయంలో నూరు సినిమాలు ఆడే రేంజ్ కి తెలుగు సినిమాను తీసుకోచ్చారు.

తెలుగు సినిమా కు గుర్తింపు తెచ్చారు. ఇక రాజకీయాల్లోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ కి కొత్త గుర్తింపు ఇచ్చారు. తనకు రాష్ట్ర నాయకులు సరి తూగరని కేంద్రంలో ప్రభుత్వంతోనే పోరాడారు. రాష్ట్రానికి కావల్సినవి తెచ్చుకున్నారు. ఆయన తెచ్చిన ఎన్నో పథకాల్లో ఆడబిడ్డ కు ఆస్థిలో సమాన హక్కు, పేదలకు బియ్యం, మధ్యపాన నిషేధం వంటి ఎన్నో పథకాలు దేశానికి ఆదర్శమాయ్యాయి అంటూ చెప్పరు. సమాజానికి ఆయన ఇంత చేసారు కాబట్టే ఆయన అందరి స్టార్స్ లాగా పుస్తకానికి అట్ట లాగానో లేక ఇంటి గోడలకు ఒక పోస్టర్ గా మిగలలేదు. ప్రతి తెలుగు వాడి ఇంటి పూజ మందిరంలో దేవుడయ్యడు అంటూ తెలిపారు.