Tarakaratna : 20 రోజుల తరువాత తారకరత్న కు బ్రెయిన్ స్కాన్… డాక్టర్లు ఏం చెప్పారు…!

Tarakaratna : నందమూరి తారక రత్న కుప్పంలో జరిగిన నారా లోకేష్ పాదయాత్రలో పాలొగ్నడానికి వెళ్లి అక్కడ పాదయాత్ర చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలి పోవడం, ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకి తరలిండం చకచకా జరిగిపోయాయి. తారకరత్న గుండె కొట్టుకోవడం ఆగిపోవడంతో 45 నిమిషాల పాటు శ్రమించి మళ్ళీ గుండె కొట్టుకునేలా కుప్పం వైధ్యులు శ్రమించారు. ఇక అక్కడినుండి బెంగళూరు నారాయణ హృదయాలయకు తీసుకెళ్లి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు చెబుతున్నా ఇంకా పరిస్థితి క్రిటికల్ గా ఉందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో తాజాగా విడుదల అయిన హెల్త్ బులిటెన్ లో తారకరత్న ఆరోగ్యం గురించి వైద్యులు కోలుకుంటున్నాడంటూ చెప్పారు.

అవయవాలు సక్రమంగా పనిచేస్తున్నాయి…

తారకరత్న పరిస్థితి విషమంగా ఉంది అంటూ సోషల్ మీడియాలో రావడంతో గురువారం వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేసి తారకరత్న ఆరోగ్యం విషయంలో నిజానిజాలను తెలిపారు. తారకరత్న చికిత్స కు స్పందిస్తున్నారని, ఆయన శరీరలోని అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయంటూ వివరించారు. శరీరంలో రక్తం ప్రసరణ అన్ని శరీర భాగలకు సక్రమంగా జరుగుతోందని అయితే బ్రెయిన్ కి సంబంధిచిన స్కాన్ పరిశీలించాల్సి ఉందంటూ చెప్పారు.

గుండె పోటు వచ్చిన సమయంలో తారకరత్న బ్రెయిన్ కు రక్తం సరఫరా కాకపోవడం వల్ల బ్రెయిన్ కి కొద్దిగా డామేజ్ జరుగుండవచ్చు అన్న అనుమానాల నడుమ విదేశాల నుండి న్యూరాలజీ కి సంబంధిచిన వైద్యులు ఆయనకు చికిత్స అందించబోతున్నారు. మొత్తానికి తారకరత్న గారు కోలుకుంటున్నారు అంటూ వైద్యులు క్లారిటీ ఇస్తున్నారు.