Actor Naresh: సీనియర్ నటుడు నరేష్ తరచూ తన వ్యక్తిగత విషయాల వల్ల వార్తల్లో నిలుస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా మూడు వివాహాలు చేసుకుని ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చి ప్రస్తుతం మరొక నటి పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో ఉంటున్నారు అయితే ఈ విషయం గురించి తరచూ నరేష్ వార్తల్లో ఉండడమే కాకుండా వీరి రిలేషన్ పై ఎంతోమంది పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తూ ఉన్నారు.
ఈ విధంగా నరేష్ పవిత్ర లోకేష్ రిలేషన్ గురించి ఎన్నో రకాల ట్రోల్స్ మీమ్స్ రావడమే కాకుండా కొన్ని యూట్యూబ్ ఛానల్ మీడియా సంస్థలు కూడా వీరి వ్యక్తిగత జీవితం గురించి పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తూ వార్తలను సృష్టిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వార్తలపై రియాక్ట్ అయినటువంటి నరేష్ మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
ఇలా తన వ్యక్తిగత విషయాల గురించి పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ తన పరువుకు భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నటువంటి సదరు చానల్ పై ఈయన పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గతంలో ఈయన ఫిర్యాదు చేయడంతో ఎంతవరకు విచారణకు వచ్చాయనే విషయం గురించి కూడా అడిగి తెలుసుకున్నారు.ఈ క్రమంలోనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన అనంతరం నరేష్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కొందరు ఉద్దేశపూర్వకంగా తన వ్యక్తిగత విషయాల గురించి దుష్ప్రచారం చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారని ఇలా తను పరువు ప్రతిష్టలను ఇలా కించపరిచేలాగా ప్రవర్తించిన వారిని సాక్షాదారాలతో సహా బయట పెడతానని, వారిపై పరువు నష్టం దావా కేసు వేస్తానని తెలిపారు. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత విషయాలు ఉంటాయి అలాగని మా బెడ్ రూమ్ బాత్రూంలోఇలా మాట్లాడుకున్నారు అలా మాట్లాడుకున్నారు అంటూ దుష్ప్రచారాలు చేస్తున్నారంటూ ఈయన ట్రోలర్స్ మీమర్స్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…