Thyagaraju: కరుడుగట్టిన విలన్ పాత్రలో అందరినీ భయపెట్టి అర్థంతరంగా కన్నుమూసిన నటుడు.. త్యాగరాజు!

Thyagaraju: సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఎలాంటి గుర్తింపు ఉంటుందో విలన్ పాత్రలో నటించే వారికి కూడా అలాంటి గుర్తింపు ఉంటుంది.ఇలా విలన్ పాత్రలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు త్యాగరాజు గురించి ఇప్పటి వారికి తెలియకపోయినా ఎన్టీరామారావు నాగేశ్వరరావు సినిమాలలో ద్వారా ఎంతో అద్భుతంగా నటించారు.

Thyagaraju: కరుడుగట్టిన విలన్ పాత్రలో అందరినీ భయపెట్టి అర్థంతరంగా కన్నుమూసిన నటుడు.. త్యాగరాజు!

1964 లో మంచి మనిషి చిత్రం ద్వారా విలన్ పాత్రలో నటించి అందరి అభిమానాన్ని సంపాదించుకున్న త్యాగరాజు ఆ తర్వాత వరుస సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఇక కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమాలో బ్రిటిష్ పోలీసాఫీసర్‌ బాస్టన్‌ దొరగా త్యాగరాజు నటన అద్భుతం అని చెప్పవచ్చు.

Thyagaraju: కరుడుగట్టిన విలన్ పాత్రలో అందరినీ భయపెట్టి అర్థంతరంగా కన్నుమూసిన నటుడు.. త్యాగరాజు!

త్యాగరాజు తన 27 సంవత్సరాల సినీ కెరీర్లో ఏడాదికి 10 సినిమాల చొప్పున నటిస్తూ ఎంతో బిజీగా గడపడమే కాకుండా మంచి నటుడిగా గుర్తింపు పొందారు.ఈ విధంగా వరుస సినిమాల్లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు త్యాగరాజు యాభై సంవత్సరాల వయసులోనే అర్థంతరంగా కన్నుమూయడం సినిమా ఇండస్ట్రీకి తీరని లోటని చెప్పవచ్చు.

గుండెపోటు రావడంతో…

ఇలా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న త్యాగరాజు 1991 ఫిబ్రవరి 24వ తేదీ హైదరాబాద్లోని అశోక్ నగర్ లో తన సోదరుడి ఇంటిలో ఉండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఈయన మృతి చెందారు. ఇలా ఇండస్ట్రీలో 50 సంవత్సరాలకి మృతిచెందిన నటుడు త్యాగరాజు మరణం సినిమా ఇండస్ట్రీకి తీరని లోటని చెప్పవచ్చు.