KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ పై దాడి చేసిన వ్యక్తి.. సిగ్గుచేటు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కేఏ పాల్!

KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ పై దాడి చేసిన వ్యక్తి.. సిగ్గుచేటు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కేఏ పాల్!

KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ చేసే వ్యాఖ్యలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన రాష్ట్ర రాజకీయాలపై ఎన్నోసార్లు విమర్శలు కురిపించారు.ఇదిలా ఉండగా తాజాగా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్, కేటీఆర్ లపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ జిల్లాలో పర్యటిస్తూ అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకుంటున్న కే ఏ పాల్ తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు.

KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ పై దాడి చేసిన వ్యక్తి.. సిగ్గుచేటు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కేఏ పాల్!
KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ పై దాడి చేసిన వ్యక్తి.. సిగ్గుచేటు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కేఏ పాల్!

సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల- జక్కాపూర్ సరిహద్దులో కేఏ పాల్ ను పోలీసులు అడ్డుకున్నారు.ఈ క్రమంలోనే కె ఏ పాల్ పోలీసులతో పెద్ద ఎత్తున వాగ్వాదానికి దిగారు. నేను రైతులను పరామర్శించడానికి వస్తే నన్ను మీరు అడ్డుకుంటున్నారు.తనను అడ్డుకుంటే చట్టపరంగా ముందుకు వెళ్లి పోలీసులను సస్పెండ్ చేయిస్తానని ఈయన పోలీసులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.

KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ పై దాడి చేసిన వ్యక్తి.. సిగ్గుచేటు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కేఏ పాల్!

ఈ విధంగా ఆ ప్రాంతంలో కె ఏ పాల్ పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా కె ఏ పాల్ మాట్లాడుతూ పోలీసులు టిఆర్ఎస్ మనుషులని పోలీసుల పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే టిఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.కే ఏ పాల్ రాజన్న సిరిసిల్లకు వెళ్లకుండా టిఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా పోలీసులకు కేఏపాల్ మధ్య వాగ్వాదం జరుగుతున్న నేపథ్యంలో ఓ వ్యక్తి దూసుకు వచ్చి కేఏపాల్ చెంప చెల్లుమనిపించాడు.

పోలీసుల వ్యవహారం పై మండిపడ్డ పాల్..

ఈ విధంగా ఆ వ్యక్తి ఒక్కసారిగా కే ఏ పాల్ పై దాడి చేయడంతో పోలీసులు అతనిని దూరంగా తీసుకు వెళ్లారు.ఇలా పోలీసులు అతడిని అడ్డుకున్నప్పటికీ ఆయన తనపై రెచ్చిపోతూ కొట్టడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే కే ఏ పాల్ మాట్లాడుతూ తనపై దాడి చేసిన టిఆర్ఎస్ కార్యకర్తలు డిఎస్పి సమక్షంలో తనపై ఇలా దాడి జరగడం సిగ్గుచేటు అంటూ విమర్శించారు. తెలంగాణ పోలీసులకు కేసీఆర్, కేటీఆర్ జీతాలు ఇస్తున్నారా? లేకపోతే ప్రజలు ప్రభుత్వం జీతాలు ఇస్తున్నారా? అంటూ పోలీసుల వ్యవహార శైలిపై కూడా కె ఏ పాల్ ఘాటుగా విమర్శలు.