Sr NTR Family: నందమూరి కుటుంబానికి శాపంగా మారిన ఆగస్టు నెల.. ఆగస్టు కలిసి రాలేదా?

Sr NTR Family: నందమూరి కుటుంబంలో ప్రస్తుతం విషాదం చోటుచేసుకుంది.నందమూరి తారక రామారావు చిన్న కుమార్తె ఉమామహేశ్వరి సోమవారం మధ్యాహ్నం తన ఇంటిలో ఆత్మహత్య చేసుకున్న విషయం మనకు తెలిసిందే.అయితే ఈమె అనారోగ్య సమస్యల కారణంగా మానసిక ఆందోళనకు గురై ఇలా ఆత్మహత్యకు పాల్పడిందని వార్తలు వస్తున్నాయి. ఈ విధంగా మృతి చెందడంతో ఆ కుటుంబంలో జరిగిన విషాద సంఘటన మరోసారి బయటకు వచ్చాయి.

సీనియర్ ఎన్టీఆర్ కి నలుగురు కుమారులు నలుగురు కుమార్తెలు సంతానం. అయితే వీరిలో మొదటి కుమారుడు రామకృష్ణ పది సంవత్సరాల వయసులోనే మృతి చెందడంతో తిరిగి తన ఏడవ కుమారుడికి అదే పేరు పెట్టారు. అయితే తన మూడవ సంతానం సాయి కృష్ణ మరణించడంతో ఆయన కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.ఇకపోతే ఎన్టీఆర్ నాలుగవ కుమారుడు హరికృష్ణ సైతం గత మూడు సంవత్సరాల క్రితం ఆగస్టు నెలలోనే రోడ్డు ప్రమాదానికి గురై మరణించిన విషయం మనకు తెలిసిందే.

ఇకపోతే హరికృష్ణ పెద్ద కుమారుడు కళ్యాణ్ రామ్ సోదరుడు జానకిరామ్ కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.కేవలం ఎన్టీఆర్ కు మాత్రమే కాకుండా ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీకి కూడా ఆగస్టు నెల కలిసి రాలేదని చెప్పాలి. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఆగస్టు నెలలో రెండు సార్లు ఈ పదవిని కోల్పోయారు. ఇకపోతే 1995 ఆగస్టు నెలలో స్వయంగా చంద్రబాబు ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచారు. అప్పుడు జరిగిన వైస్రాయ్ స్కెచ్ కి ఇక ఎన్టీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కాలేదు.

Sr NTR Family: ఎన్టీఆర్ కుటుంబానికి టిడిపి పార్టీకి ఇది శాపమా…

ఇకపోతే తాజాగా ఆగస్టు నెలలోనే మరోసారి ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకోవడం అందరిలో విషాదం నింపింది.ఈ విధంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా ఆయన స్థాపించిన పార్టీకి ఆగస్టు నెల శాపంగా మారిందని, ఈ నెలను ఎన్టీఆర్ ఫ్యామిలీకి అలాగే టిడిపి పార్టీకి బ్యాడ్ సెంటిమెంట్ గా భావిస్తున్నారని చెప్పాలి.