Anchor Anasuya: బుల్లితెర కార్యక్రమాల ద్వారా ఎంతో మంది ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా కొనసాగుతున్నారు. ఈ విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు పొందిన వారిలో అనసూయ ఒకరు. జబర్దస్త్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం ఈ కార్యక్రమానికి గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం అనసూయ ఈ స్థాయిలో ఉందంటే అందుకు పరోక్షంగా జబర్దస్త్ కార్యక్రమం కారణమని చెప్పాలి.
ఇన్ని రోజులు అనసూయ జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పుకుంటుందని వార్తలు వచ్చాయి. అయితే గతవారం ఆమె అధికారకంగా ప్రకటిస్తూ తను ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు. ఇకపోతే అనసూయ ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే..ఈమెకు వరుస సినిమాలు వెబ్ సిరీస్ ల అవకాశం రావడంతోనే ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నారని వార్తలు వచ్చాయి.
అదేవిధంగా మరొక చానల్లో తనకు భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేయటం వల్లే జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పారని తెలుస్తోంది. ఇకపోతే తాజాగా అనసూయ జబర్దస్త్ కార్యక్రమాన్ని వీడిపోవడానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అనసూయను జబర్దస్త్ కార్యక్రమం వదిలి రమ్మని టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ పెద్ద డైరెక్టర్ అనసూయ గురూజీ సలహా ఇచ్చారని వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం తాను వెండితెరపై సెలబ్రిటీగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ సమయంలో తను ఇంకా బుల్లి తెరపై కొనసాగుతూ ఉంటే తన కెరీర్ కి మైనస్ అవుతుందని సలహా ఇవ్వటం వల్లే అనసూయ జబర్దస్త్ కార్యక్రమాన్ని మానేసిందని వార్తలు వస్తున్నాయి.మరి అనసూయకు సంబంధించిన ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…