Unstoppable: అన్ స్టాపబుల్ అనధికారిక ప్రసారాలు నిలిపివేయాలి.. ఆదేశాలు జారీచేసిన ఢిల్లీ హైకోర్టు!

Unstoppable: ప్రముఖ ఓటిటి సంస్థ ఆహా వేదికగా ప్రసారం అవుతున్న “అన్ స్టాపబుల్ “రియాలిటీ షో మంచి రేటింగ్స్ సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ రియాలిటీ షోలో ఎంతోమంది సెలబ్రిటీలు గెస్ట్లుగా పాల్గొని సందడి చేస్తున్నారు. దీంతో ఈ రియాలిటీ షో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని అత్యధిక రేటింగ్స్ సొంతం చేసుకుంటూ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.

గత కొద్ది రోజులుగా అన్ స్టాపబుల్ రియాలిటీ షో కి సంబంధించిన ప్రోమోలు, ఎపిసోడ్ లు అనధికారికంగా సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేస్తున్నారు. ఈ విషయం గురించి ఇప్పటికే ఆహా సంస్థ ఇలా అనధికారిక ప్రసారాలను నిలిపివేయాలని హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఇటీవల ఇలాంటి అనధికారిక ప్రసారాలకు అడ్డుకట్ట వేయటానికి అర్హ మీడియా అండ్ బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.

అన్ స్టాపబుల్ షో ని నియమాలకు విరుద్ధంగా అనధికారికంగా ప్రసారం చేయటం వల్ల షోపై తీవ్ర ప్రభావం చూపుతుందని.. ప్రభాస్ గెస్ట్ గా హాజరైన ఎపిసోడ్ డిసెంబర్ 30 వ తేదీన ప్రసారం కానుండటంతో ఆ ఎపిసోడ్ తో పాటు మిగిలిన ఎపిసోడ్లను కూడా అనధికారికంగా ప్రసారం చేయకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టుని ఆశ్రయించారు. అనధికారిక ప్రసారాల వల్ల షో నిర్వాహకులు తీవ్రంగా నష్టపోతున్నారని.. అందువల్ల వాటిని అరికట్టటానికి మీడియా మాధ్యమాలపై చర్యలు తీసుకునేలా ‘ డైనమిక్ ఇంజక్షన్’ మంజూరు చేయాలని కోర్టుని కోరారు.

Balakrishana – Chiranjeevi: బాలయ్య టాక్ షో కి చిరంజీవి రాకపోవడానికి వెనుక ఇంత పెద్ద కారణం ఉందా?

Unstoppable: వెంటనే ఆ లింక్ తొలగించాలి..


ఈ విషయంపై విచారణ చేపట్టిన జస్టిస్ సంజీవ్ సెర్చ్ దేవ్ తాజాగా కీలక ఆదేశాలను జారీ చేశారు. అన్ స్టాపబుల్ షో అనధికారిక ప్రసారాలపై కోర్టు తీర్పునిస్తూ తదుపరి విచారణ వరకు ‘ మధ్యంతర ఇంజక్షన్ ‘ ఇస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. అలాగే అన్ స్టాపబుల్ షో కి సంబంధించి సామాజిక మాధ్యమాలలో ఉన్న లింకులను వెంటనే తొలగించాలని టెలి కమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్ మంత్రిత్వ శాఖ తో పాటు ఇంటర్నెట్ ప్రొవైడర్లకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.