Movie News

Thammareddy Bharadwaja: నాగబాబు మాట్లాడకపోతేనే చిరంజీవి గౌరవం పదిలంగా ఉంటుంది: తమ్మారెడ్డి భరద్వాజ్

Thammareddy Bharadwaja: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా గుర్తింపు పొందిన చిరంజీవి ది అలుపెరుగని ప్రస్థానం . ఎవరి అండ దండాలు లేకుండా ఒంటరిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి మెగా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో నంబర్ వన్ హీరోగా గుర్తింపు పొందిన చిరంజీవి స్థానం ఇప్పటికీ పదిలంగానే ఉంది. మధ్యలో కొంతకాలం రాజకీయాలలో ప్రవేశించి సినిమాలకు దూరమైనప్పటికీ.. మళ్లీ ఖైదీ నెంబర్ 150 సినిమా ద్వారా ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చి తన సత్తా నిరూపించుకున్నాడు.

ఇక అప్పటినుండి వరస సినిమాలలో నటిస్తూ నేటి యువ హీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇక చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన సినిమాలలో మరొక హీరో ఉండటం మనం గమనిస్తూనే ఉన్నాం. ఈ విషయం గురించి ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల సోషల్ మీడియాలో చిరు మార్కెట్ తగ్గిపోయిందని వస్తున్న వార్తలలో నిజం లేదని.. ఇప్పటికీ ఇండస్ట్రీలో ఆయన మార్కెట్ ఆయనకు సపరేట్గా ఉంటుందని వెల్లడించాడు.

చిరంజీవిగారిని ఎవ‌రో వ‌చ్చి జాకీ పెట్టి లేపాల్సినంత అవ‌స‌రం లేదని.. ఆయ‌న ఫాలోయింగ్, రెవెన్యూ ఆయనకు ఉన్నాయని తమ్మారెడ్డి వెల్లడించాడు. ఇక ఈ సందర్భంగా నాగబాబు గురించి మాట్లాడుతూ సంచలనం వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల ఒక ఈవెంట్ లో పాల్గొన్న నాగబాబు చిరంజీవికి రెడ్ కార్పెట్ పరిచి ఆ తర్వాత చిరంజీవి గురించి తక్కువగా మాట్లాడారని చెప్పుకొచ్చాడు.

Thammareddy Bharadwaja: చిరంజీవిని జాకీ పెట్టి లేపాల్సిన పనిలేదు…


ఇక నాగబాబు చేసిన వ్యాఖ్యల గురించి తమ్మారెడ్డి భరద్వాజ స్పందిస్తూ… చిరంజీవి గారిని ఎవరు తక్కువ చేసి మాట్లాడారని నాగబాబు వారు అన్నారు.. కానీ చిరంజీవి అలాంటి వాటిని పెద్దగా పట్టించుకోరని.. మనం అలాంటి విషయాలను పట్టించుకుంటే ఎదుటివారి స్థాయిని పెంచి చిరు స్థాయి తగ్గించినట్లు అవుతుందని తమ్మారెడ్డి వెల్లడించాడు. అందువల్ల నాగ‌బాబు గారు అలాంటి విష‌యాల‌ను మాట్లాడ‌క‌పోతే చిరంజీవి గారి గౌర‌వం ఇంకా పెరుగుతుంద‌ని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago