Senior Journalist Imandhi Ramarao : ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో విపక్షం తెలుగు దేశమైనా అధికార పక్షం విమర్శలు మాత్రం జనసేన పార్టీ మీద, ఆ పార్టీ అధినేత మీదే. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి ఇంతవరకు విమర్శలు చేస్తూ వచ్చిన వైసీపీ వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు వ్యక్తిత్వం లేదు సొంతంగా ఆలోచించలేడు అంటూ విమారుస్తున్నారు. ఏకంగా సీఎం జగన్ కూడా పవన్ మూడు పెళ్లిళ్ల గురించి విమర్శిస్తున్నారు. ఇక రోజా, పేర్ని నాని, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, బొత్స వంటి వారి నోటికి అదుపు లేకుండా ఉంది. ఇక పవన్ కళ్యాణ్, బాలకృష్ణ షో అన్ స్టాపబుల్ లో పాల్గొనడం గురించి వైసీపీ పార్టీ నేతలు చేసిన కామెంట్స్ మీద సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు మాట్లాడారు.
నీ గతం చూసుకో రోజా…
ఇమంది గారు మాట్లాడుతూ పవన్ ను విమర్శించే ముందు నీ గతం చుస్కో రోజా అంటూ ఫైర్ అయ్యారు. పవన్ కు వ్యక్తిత్వం లేదని, చంద్రబాబు ఏం చెబితే అది చేస్తున్నాడు అన్నట్లుగా రోజా మాట్లాడటం సమంజసం కాదు అంటూ ఇమంది రామారావు అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ కు వ్యక్తిత్వం ఉంది కాబట్టే ఆయన సొంతంగా నిర్ణయాలు తీసుకునే తెగింపు ఉంది కాబట్టే సినిమాలు చేస్తే కోట్లు వస్తున్నా రాజకీయాల్లోకి వచ్చారంటూ మాట్లాడారు ఇమంది.
పవన్ కళ్యాణ్ ఒకప్పుడు నందమూరి ఫ్యామిలీని విమర్శించడం, నాగబాబు నాకు బాలకృష్ణ ఎవరో తెలియదు అనడం ఇవన్నీ గుర్తు చేస్తూ రోజా పవన్ ను విమర్శించారు. అయితే వీటి గురించి ఇమంది మాట్లాడుతూ అలా మాట్లాడాల్సి వస్తే కాంగ్రెస్ పార్టీని, రాజశేఖర్ రెడ్డి ని, జగన్ ను ఎలా విమర్శించావో మర్చిపోయావా అంటూ రోజా ను విమర్శించారు ఇమంది రామారావు. ఒకప్పుడు తీవ్రంగా నువ్వు విమర్శించిన జగన్ పంచన ఈనాడు చేరి మాట్లాడుతున్నావు, గతం మర్చిపోకు రోజా అంటూ ఫైర్ అయ్యారు ఇమంది రామారావు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…