Charan -Upasana: చరణ్ ఉపాసన పెళ్లి బంధానికి పదేళ్ళు… పెళ్లి రోజు వేడుకల కోసం అక్కడికి వెళ్ళిన రామ్ చరణ్ దంపతులు?

Upasana: పిల్లల గురించి స్పందించిన ఉపాసన… మీకలా అర్థమైందా.. పూర్తి వీడియో చూడండి అంటూ కామెంట్స్?

Upasana: మెగా కోడలిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఉపాసన పిల్లల విషయం గురించి తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.వీరికి వివాహం జరిగి 10 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈ దంపతులకు పిల్లలు లేకపోవడంతో ప్రతి ఒక్కరు మీరు పిల్లల గురించి పెద్ద ఎత్తున ప్రశ్నలు వేస్తున్నారు. ఈ క్రమంలోనే తనకు పిల్లల గురించి ప్రశ్నలు ఎదురైన సమయంలో ఉపాసన సరైన సమయం వచ్చినప్పుడు మాట్లాడతానని తప్పుకునేవారు.

ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం ఈమె ఓ కార్యక్రమంలో భాగంగా సద్గురుని కలిసినప్పుడు తాను పిల్లల గురించి ప్రశ్నించిన విషయం మనకు తెలిసిందే. నేను తన జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నాను కానీ నన్ను పిల్లల గురించి ఎందుకు ఇలా ప్రశ్నిస్తున్నారు అంటూ ఈమె సద్గురిని ప్రశ్నించారు.ఇక సద్గురు ఈమెకు సమాధానం చెబుతూ ప్రస్తుతం పెరిగిపోతున్న జనాభా వల్ల పిల్లలను కనకపోవడమే మంచిది. ఇలా పిల్లలను ఎవరైతే వద్దనుకుంటారో అలాంటి వాళ్లకు తాను బహుమానం ఇస్తానని చెప్పారు.

Upasana: త్వరలోనే మెగా గుడ్ న్యూస్ చెప్పబోతున్న ఉపాసన.. వారసుడోస్తున్నాడు అంటూ ఖుషి అవుతున్న ఫ్యాన్స్?

అయితే ఈ వీడియో చూసిన ఎంతో మంది నెటిజన్లు జనాభా తగ్గించడం కోసమే ఉపాసన దంపతులు పిల్లలను వద్దనుకుంటున్నారా అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు.అయితే తన గురించి వస్తున్నటువంటి ఈ వార్తలపై ఉపాసన స్పందిస్తూ ఓ మై గాడ్ మీకు అలా అర్థమైందా.. అంటూ విచారం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే తాను సద్గురుతో మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోని మీరు పూర్తిగా చూసిన తర్వాతే ఓ నిర్ణయానికి రండి అని చెప్పారు.

పిల్లల గురించి వస్తున్న వార్తలపై విచారం వ్యక్తం చేసిన ఉపాసన…

ఈ వీడియోతో పాటు తాను చేసిన పోస్ట్ కూడా చూడాలని ఉపాసన ఈ సందర్భంగా పిల్లల గురించి మరోసారి స్పందించారు.పిల్లలు వద్దు అనుకునే వారికి సద్గురు బహుమానం ఇస్తానని చెప్పారు. అయితే ఆ బహుమానం తీసుకోవడానికి మా తాతయ్య ఒప్పుకోవడం లేదు అంటూ ఉపాసన పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఉపాసన పోస్ట్ చేయడంతో తనకు బహుమానం వద్దంటే పిల్లలు కావాలని అర్థం అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.మొత్తానికి ఉపాసన పిల్లలు కనాలనే ఉద్దేశంలో ఉన్నారని తెలుస్తుంది అయితే ఈ శుభవార్త ఆమె ఎప్పుడు చెబుతారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.