Vani jayaram death mistry : వాణి జయరాం మృతికి కారణాలు ఇవే… బయటపడ్డ కీలక విషయాలు…!

Vani Jayaram death Mistrey : సౌత్ లో నార్త్ లో సింగర్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న గాయని వాణిజయరాం. తమిళ నాడు వేలూరు కి చెందిన వాణి జయరాం తన గాత్రంతో హిందీ, తమిళం, కన్నడ, తెలుగు, మలయాళం ఇలా పలు భాషల ప్రేక్షకులను అలరించారు. తెలుగులో ‘పూజ సినిమాలోని ఎన్నెన్నో జన్మల బంధం’ పాటతో బాగా ఫేమస్ అయ్యారు వాణి జయరాం. హిందీ లోనూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న వాణి జయరాంకు దక్కవలసిన గుర్తింపు మాత్రం దక్కలేదనే విమర్శలు ఉన్నాయి. 77 ఏళ్ల వయసున్న ఆమె ఫిబ్రవరి 4 న మరణించారు.

హత్య కాదు.. తేల్చిన ఫారెన్సిక్ నిపుణులు…

వాణి జయరాం అనుమానాస్పద స్థితిలో ఆమె ఇంట్లోనే మరణించడం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆమె మరణం సహజ మరణం కాదు అని ఎవరో హత్య చేసారు అనే పుకార్లు బాగా వినబడ్డాయి. ఇక ఆమె ముఖం మీద గాయాలు ఉండటం వల్ల ఈ వదంతులు ఎక్కువయ్యాయి. అయితే వాణి జయరాం కేసును దర్యాప్తు చేసిన పోలీసులు ఆమె మరణం మీద ఎలాంటి అనుమానాలు లేవంటూ చెప్పారు, సహజంగానే మరణించినట్లు పోలీసులు తేల్చారు. ఆమె గదిలో కిందపడినప్పుడు ముఖానికి, తలకు గాయాలు తగలడంతో మరణించినట్లు ధ్రువీకరించారు.

ఫారెన్సిక్ నిపుణులు ఆధారాలను సేకరించి అలానే అపార్ట్మెంట్ లోని సీసీ టీవీలను పరిశీలించి ఆమెది హత్య కాదని సహజ మరణమని ధ్రువీకరించారు. ఒంటరిగా ఉంటున్న వాణి జయరాం గారు గదిలో కిందపడగానే శబ్దం విన్న పనిమనిషి వచ్చి తలుపు తీయడానికి ప్రయత్నించగా రాకపోవడంతో తలుపులు బద్దలు కొట్టి చూసారు. ఇక వెంటనే పోలీసులకు సమాచారం అందించి అలాగే బంధువులకు సమాచారం ఇచ్చారు. ఇంటిని పోలీసుల అదుపులో ఉంచుకుని ఆధారాలను సేకరించగా అనుమానస్పదంగా ఏమీ కనిపించలేదు. ఇక వాణి జయరాం అంత్యక్రియలు తమిళనాడు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో చేసారు. ఆమెను కడసారి చూసేందుకు భారీగా అభిమానులు వచ్చారు.